V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 18:
డాక్టర్ కారెం, డాక్టర్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ డెంటల్ కన్వెన్షన్ హల్ నందు బుధవారం డాక్టర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు కిమ్స్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం డాక్టర్ పట్టాలను అందించింది. గతంలో కోనసీమ కేర్ ఆస్పటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కిమ్స్ మెడికల్ కాలేజ్ లో అధ్యాపకులుగా విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధించారు. డాక్టర్ పట్టా తీసుకున్న, డాక్టర్ శరత్, అనిల్,సాహిత్, నసార్ రెడ్డి,లు రవితేజ శిష్యులుగా బెస్ట్ స్టూడెంట్ గా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ రవితేజ వారిని అభినందించారు.