

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆమలాపురం జూన్ 02:

బండారు లంక గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అనే వదంతులు పూర్తిగా అసత్యమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ ఉదయ భాస్కర్ తెలియచేశారు. సోమవారం అమలాపురం బండారులంక గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అనే విషయమై గ్రామంలో ఉన్న ఆరు రేషన్ డిపోల లోని బియ్యం నిల్వలను సంబంధిత పౌరసర ఫరాల ఉప తాసిల్దార్లు పోలీస్ రెవిన్యూ సిబ్బందితో పూర్తిగా తనిఖీ చేయడం జరిగిందని ఈ తనిఖీలు ఎక్కడ కూడా స్టాక్ లో వ్యత్యాసాలు ఉత్తన్నం కాలేదని అందువల్ల ఈ బియ్యం రేషన్ షాపుల నుండి వచ్చినట్లు ధ్రువీకరించలేమని తెలిపారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా వదం తులు పూర్తిగా అవాస్త వమని తేలిందని ఆయన ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే ఈ బియ్యం ఎక్కడినుండి వచ్చాయి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేసే ప్రయత్నం కావచ్చునని తెలిపారు.రేషన్ బియ్యం ప్రతి నెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్దేశిత సమయాలలో చౌక దుకాణాలు షాపులు తెరిచి ఉంచి కార్డుదారు లందరికి పూర్తిస్థాయిలో నిత్యవసర వస్తువులను సరఫరా చేయడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఈపిఓ పాస్ మిషన్లు లలో సాంకేతిక లోపాలు ఉత్పన్నమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ద్వారా నిత్యవసరాలు సరఫరా చేసేందుకై ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు