



V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 08:

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రాంతంలో స్థాపించబడింది. ప్రింట్ మీడియా గా ప్రజాయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు గూగుల్లో ఎప్పుడు కప్పుడు ప్రతి వార్తఆన్లైన్ చేయబడే విధంగా పత్రిక నడుస్తుంది.

అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా గా#V9LIVETV గా యూట్యూబ్ ఛానల్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా సంస్థ వారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి రోజు వెయ్యి న్యూస్ పేపర్ సర్కులేషన్ చేయబడే విధంగా రూపొందిస్తున్నారు.

మంగళవారం రాజోలు నియోజకవర్గం వైసిపి పార్టీ ఇన్చార్జి మరియు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు (M A. LLB) గారుతో సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ మీడియా విధి విధానాలు వివరించుటకు సమావేశమయ్యారు. తదుపరి పి గన్నవరం నగరం మార్కెట్ యార్డు చైర్పర్సన్ పెనుమాల లక్ష్మీ(BTech) గారిని కలిసి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి మీడియా పరిస్థితులను వివరించారు. సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ను మాజీమంత్రి గొల్లపల్లి సూర్యరావు మరియు నగరం మార్కెట్ యార్డు చైర్పర్సన్ పెనుమాల లక్ష్మీ గార్లు ఎల్లప్పుడూ అంద దండుగా ఉంటామని ప్రోత్సహిస్తూ… అభయం ఇచ్చారు. వారి ఇరువురికి వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు శిష్యుడుగా మరియు విదేయుడుగా వినయ్ కుమార్ కు మంచి పేరు ఉంది.
ప్రస్తుతం నగరం మార్కెట్ యార్డు చైర్పర్సన్ పెనుమాల లక్ష్మీ అప్పటి ప్రజారాజ్యం పార్టీ లో పనిచేసిన మహిళా నాయకురాలుగా సోషల్ మీడియాలో వినయ్ కుమార్ కు మంచి పరిచయాలు ఉన్నాయి.