
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం ఆగస్టు 07:
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తో వైఎస్ఆర్సిపి నేత నేలపూడి స్టాలిన్ బాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులుగా ప్రపంచం లోనే భారత కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేసే విధంగా నూతన ఆవిష్కరణలు చేస్తున్న నాగేశ్వర్ రెడ్డి సేవలను ప్రస్తుతించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారానికి నాగేశ్వర్ రెడ్డి పేరును ప్రతిపాదించడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ బాబు తన రచన సంజీవయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయనకు అందజేశారు.