

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి /అమలాపురం ఆగస్టు 06:

- నాగయ్య ఆశయాల సాధనకు ప్రజలు ఉద్యమించాలి
- ఘనంగా నిర్వహించిన నాగయ్య సంస్మరణ సభ

కష్టజీవులు శ్రామికుల హక్కులకై పోరాడిన ఉద్యమకారుడు కామ్రేడ్ మచ్చ నాగయ్య అని ఆయన మరణం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటని నాగయ్య ఆశయాలకై ప్రజలు ఉద్యమించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.

ఇటీవల మృతి చెందిన విప్లవ కమ్యూనిస్టు నాయకుడు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ మచ్చా నాగయ్య సంస్మరణ సభ బుధవారం అయినవిల్లి లంక గ్రామంలో నాగయ్య స్వగృహం వద్ద కుటుంబ సభ్యులు ప్రజా సంఘాలు ఘనంగా నిర్వహించాయి నాగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాగయ్య మృతికి నివాళిగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుమ్మరి మాధవి రమణ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిలుగా విచ్చేసిన చిట్టిబాబు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి బూర్జువా భూస్వామ్య పార్టీలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు శ్రామికుల హక్కులకై కామ్రేడ్ మచ్చ నాగయ్య జీవితాంతం పోరాటం చేశారని సిపిఐ ఎంఎల్ పార్టీలో కమ్యూనిస్టు విప్లవకారుడుగా జీవించాడని నాగయ్య సేవలను కొనియాడారు దళితులు బలహీనవర్గాలు కష్టజీవుల సమస్యలపై నాగయ్య నిరంతరం ఉద్యమించేవారని తెలిపారు విద్యార్థి దశలో పి డి ఎస్ యు విద్యార్థి సంఘంలో రాష్ట్ర నాయకుడిగా రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనేక పోరాటాలు నాగయ్య నిర్వహించారని 40 ఏళ్లుగా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి పని చేసిన ఘనత నాగయ్యకు దక్కుతుందని ఆయన లేని లోటు విప్లవ రాజకీయాలకు తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో సంచలనం కలిగించిన ఢిల్లీ రైతుల ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాలలో నాగయ్య పాల్గొని సంఘీభావం తెలిపారని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కొరకు జీవించాడని ఎలాంటి మచ్చలేని మచ్చ నాగయ్య జీవితం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయాలకై ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం ఉద్యమించాలని అదే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు ఆయన మృతి కుటుంబ సభ్యులకు పేద వర్గాల ప్రజలకు తీరని లోటు అని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

నాగయ్య సహచర మిత్రులు పిచ్చుక శ్యామలరావు ఎస్ ఆర్ వేమన రేవు నాగేశ్వరరావు జిల్లెల్ల మనోహరం సరళ దాసు నాగయ్యతో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేవు తిరుపతిరావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఏడిద రాజేష్ ఏ రవి ముత్యాల శ్రీనివాసరావు పౌర హక్కుల సంఘం నాయకులు అమలదాసు బాబురావు చైతన్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు కే రమ దళిత బహుజన మహిళ శక్తి నాయకురాలు కొంకి రాజమణి సిపిఐ ఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి పార్టీ నాయకులు బి రాజన్న అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జే సత్తిబాబు బిఎస్పీ జిల్లా నాయకులు జిత్తుగ సత్యనారాయణ కోణాల ప్రకాష్ బొంతు రమణ సెట్టుబత్తుల తులసీరావు బడుగు జోగేష్ కాశి సత్యనారాయణ కొండేటి వెంకటేశ్వరరావు మాగాపు ఈశ్వరరావు వివిధ ప్రజాసంఘాల నాయకులు శ్రామిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.