రామచంద్రపురం అన్నా క్యాంటీన్ తనిఖీ చేసిన ఆర్డిఓ దేవరకొండ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఫిబ్రవరి 22:

పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు పనిచే స్తున్నాయని ఆహార నాణ్యతపై అధికశాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల తెలిపారు శనివారం ఆమె స్థానికంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ సందర్శించి ప్రాంగణం, ప్లేట్లు పరిశుభ్రత, ఆహార నాణ్యత, టోకెన్లు జారీ,సకాలంలో క్యాంటీన్ తెరవడం వంటి అంశా లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్ నిరుపేదల ఆకలి తీర్చ డంలో ఒక వరంగా మరియు కీలకంగా మారాయన్నారు.వివిధ రంగాలలో జీవనోపాధి పొందుతున్న చివరి స్థాయి కార్మికులు అన్న క్యాంటీన్లను ఆశ్రయించి ఆకలి తీర్చుకుంటున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని తెలిపారు.

దిగువ స్థాయి రోజువారి చిరు వ్యాపా రస్తుల పాలిట ఈక్యాంటీ న్లు ఒక వరంగా మారి ఆకలిని తీర్చడంలో కీలక భూమిక పోషిస్తున్నాయ న్నారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యా ర్థులు, పొట్టకూటి కోసం పల్లెలనుంచి,పట్టణాలకు వచ్చే రోజు వారీ కూలీ లు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడే ఆటో డ్రైవర్లు, ప్రైవేటు ఉద్యోగులు. ఇతరులకు అన్న క్యాంటీన్లే ఆకలి తీరుస్తున్నాయన్నారు అల్పాహారమైనా, భోజనమైనా రూ.5 కే అందిస్తుందని రోడ్డు పక్క టీ తాగాలన్నా కనీసం రూ 10 లు వసూలు చేస్తున్నారని అన్న క్యాంటీన్లలో ఉదయం అల్పాహారమైనా మధ్యా హ్నం, రాత్రికి భోజనమైనా ఆహారం ఇంత తక్కువకు ఎక్కడ లభించదని అక్కడి కొచ్చే వారంతా ముక్త కంఠంతో చెబుతున్నారన్నా రు.నిరాశ్రయులు, పూట గడవని నిరుపేదలు మాత్రమే కాదుమధ్య తరగతి వారు అన్న క్యాంటీన్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని గ్రామాల నుంచి వైద్య పరీక్షలు, చికిత్సల నిమిత్తం అసుపత్రులకు వచ్చే వారు వాటినే ఆశ్రయిస్తున్నా రన్నారు.

హోటళ్లకు వెళ్లే ఆర్థిక స్తోమత లేని వారు అన్నా క్యాంటీన్లో రూ.5, చాలక పోతే మరో రూ 5 ఇచ్చి మరో టోకెన్ తీసుకొని సంతృప్తిగా ఆకలిని తీర్చుకుంటున్నా రన్నారు ఒక్కసారైనా అన్న క్యాంటీన్లో తిందాం అనే ఆసక్తితో ఆటో డ్రైవర్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, ఇతర చిరు వ్యాపారులు. తాపీ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, పెయింటర్లు, నిరుద్యోగులు, వలస కూలీలకు క్యాంటీన్లు ఆసరాగా మారి ఆద రాభిమానాలను చూర గొoటున్నాయన్నారు వందలాది మంది విద్యార్థులు. గదులు అద్దెకు తీసుకుని ఉంటున్న. వారంతా అన్న క్యాం టీన్లనే ఆశ్రయిస్తున్నారన్నారు.

వీటి పుణ్యమా అని రోజువారీ కూలీలే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకొనే విద్యార్థులకు రూ.15 కే మూడు పూటలా కడుపు నింపుకుంటున్నా రన్నారుఅక్కడ కొచ్చిన అందరూ ఆహారం, ఇతర ఏర్పాట్ల పై సంతోషం వెలిబుచ్చు తున్నారన్నారు ఆహార నాణ్యతపై అధిక శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని. పరిశుభ్రత, నాణ్యతపై మరింత శ్రద్ద పెట్టారని కొందరు సూచిం చారన్నారు.. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు సిబ్బంది పాల్గొ న్నారు

Related Articles

అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6: అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని […]

10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24: నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక […]

ఏప్రిల్ 20న మెగా ఉచిత వైద్య శిబిరం:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యలుచే వైద్య పరీక్షలు నవ్యాంధ్ర ప్రదేశం మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాబు నాయుడు 75 వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ ఆరోగ్యం- మా బాధ్యత అనే నినాదంతో “సత్యం […]

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 18: అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే – 2025 ను పురస్కరించు కొని ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులకు […]