250 అర్జీలు స్వీకరించిన అమలాపురం కలెక్టరేట్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం ఆగస్టు 04:

ఆర్జీల పరిష్కారంలో నూటికి నూరు శాతం నాణ్యతతో పాటుగా నిర్దిష్టమైన స్పష్టత ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)) కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ గోదావరి పవన్ నందు జిల్లా కలెక్టర్ డా” ఆర్ మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిషాoతి అర్జీదారుల నుంచి సుమారుగా 250 అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ప్రజా సమ స్యల పరిష్కర వేదిక కార్యక్రమం ద్వారా అందే ఆర్జీలను పారదర్శకంగా, జవాబు దారితనంతో నిర్థిష్టమైన స్పష్టతతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరి ష్కరించాలని అధికారు లను ఆదేశిం చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన సమస్యలకు సంబంధించి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆశ్ర యిస్తారన్నారు.

ఆర్జీదారు డు పనితీరుపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్దేశించిన సమయంలో పరిష్కరిం చాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం ప్రద ర్శించిన ఉపేక్షించబోనని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. పరిష్కార వేదిక లో నమోదు అయ్యే ఆర్జీల పరిష్కారం పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని,

ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణీత కాలపరి మితిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారు లను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఇన్చార్జి డిఆర్ఓ మరి యు ఆర్డీవో కే మాధవి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి కృష్ణ మూర్తి, జి ఎస్ డబ్ల్యూ ఎస్ కోఆర్డినేటర్ రాజేశ్వరరావు, జిల్లాస్థాయి అధికారులు, వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ తదితరులు పాల్గొ న్నారు.

Related Articles

ఏడిద లో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు

మండపేట మండలం ఏడిద బల్ల గేటు సెంటర్ లో శనివారం మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏడిద వైసిపి అధ్యక్షులు పలివెల సుధాకర్ ఆద్వర్యంలో […]

10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24: నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక […]

ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో సీఎం చంద్రబాబు పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 29: ఈనెల మే 31 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనవిజయవంతం […]

ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజానికే కాదు ప్రపంచ సమాజానికే తీరుని లోటు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజమండ్రి మార్చి 26: ప్రవీణ్ పగడాల మరణం క్రైస్తవ సమాజానికే కాదు ప్రపంచ సమాజానికే తీరుని లోటును మిగిల్సిందని తెలుగు రాష్ట్రాల క్రైస్తవ సంఘాలు […]