

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మామిడికుదురు ఆగస్టు 05:

నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి కుటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు రేపు బుధవారం నగరానికి తరలిరావాలని చైర్ పర్సన్ లక్ష్మీ బాలరాజు పిలుపునిచ్చారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన పార్టీ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆగస్టు 6 బుధవారం మామిడికుదురు మండలం నగరంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా పెనుమాల లక్ష్మి బాలరాజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు .ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ, బిజెపి,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,ప్రతినిధులు హాజరై ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు .