
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కలెక్టరేట్ అమలాపురం జులై 30:

అమలాపురం ముఖద్వారం ఈదరపల్లి వంతెనకు ఇరు వైపులా (ఎగువ దిగువ) పురపాలక సంఘo, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమన్వయం తో వాహనాలు పాదచారులు సులభతరంగా రాక పోకలు సాగించే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సుం దరీకరిం చాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు.

బుధవారం పురపాలక రహదారులు భవనాల శాఖ ఏపీ ఈపీడీ సీఎల్ ఇంజనీర్లతో సమా వేశం నిర్వహించి ఇటీవల నూతనంగా నిర్మించిన ఈదరపల్లి వంతెన ఎగువ దిగువ సుందరీకరణ పను ల పురోగతిపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రోచ్ రోడ్ల నిర్మా ణాన్ని వేగవంతం చేస్తూ వంతెన సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. వంతెనకు ఇరువైపులా అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని ఏపీ ఈపీ డీసీఎల్ సూపరిం టెంట్ ఇంజనీర్ బి రాజే శ్వరిని ఆదేశించారు. రహదారులు భవనాల శాఖ అధికారులు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పను లపై పోకస్ పెట్టాలని సూ చించారు. ఈ కార్యక్రమం లో రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాము, స్థానిక పురపాలక సంఘ కమి షనర్ నిర్మల్ కుమార్ ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.