
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 28:

అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మకంగా నూటికి నూరు శాతం సంతృప్తి కొలమానంగా తగు పరి ష్కార మార్గాలు చూపాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా సుమారుగా 228 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ప్రజల ఫిర్యాదులు, అభ్యంతరాల ను స్వీకరించి వాటిని సంతృప్తికర స్థాయిలో సమర్థవంతంగా పరిష్కరిస్తూ పారదర్శకతకు పెద్దపీట వేయాలని, బాధ్యతాయుతంగా అర్జీదారుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ అంకితభావంతో పనిచే యాలన్నారు.

ఫిర్యాదులపై వేగవంతమైన పరిష్కారంపై సంబంధిత అధికారులకు మార్గ నిర్దేశం చేయాలన్నా రు. అర్జీదారు లకు ఫిర్యాదు స్థితిపై సమా చారాన్ని 1100 ద్వారా తెలుసు కోనవచ్చునన్నారు. ఫిర్యాదులు పరిష్కార స్థితిలో ప్రతి స్పంద నను తెలుసుకు నేందుకు ఐవీ ఆర్ఎస్ డిజిటల్ యాప్ ప్రశ్నావళి ద్వారా తెలు సుకుంటూ సంతృప్తి చెందని పక్షంలో మరల ఆ యొక్క దరఖాస్తు పునరావృతం అవుతుందన్నారు.

కావున నిర్దేశిత గడువులోగా అర్జీలు పరిష్కరిస్తూ అర్జీలు పున రావృతం కాకుండా అప్రమ త్తంగా వ్యవహరిస్తూ గడుగు లోగా పరిష్కరిం చాలని ఆదేశించారు ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషా oతి. డిఆర్ఓ రాజకుమారి దోమ పిడి మధుసూదన్, వికాస జల మేనేజర్ జీ రమేష్ జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.