
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అంబాజీపేట జూలై 28 :

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల పురోగతి,ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి ఆదే శించారు సోమవారం అంబాజీపేట మండల తాసిల్దార్ కార్యాలయం సచివాలయ సందర్శన తోపాటు క్షేత్రస్థాయిలో రీ సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ ప్రాధాన్యత అంశా లలో ఆశించిన పురోగతిని తీసుకురావాలని సిబ్బందినీ ఆదేశించారు అర్హత కలిగిన కౌలుదా రులకు సిసిఆర్సి కార్డులు జారీ, అందరికీ ఇండ్లు అన్నదాత సుఖీభవ కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్@ 2047 లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా నియోజకవర్గాల వారీగా దార్శనిక ప్రణాళికల రూపకల్పన జరిగిందని, శాఖల వారీగా కీలక పురోగతి సూచికలు (కేపీఐ)లపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రధానంగా ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టి, రైతులను ప్రోత్సహించాలన్నారు.. వ్యవసాయం,రెవెన్యూ సచివాలయ శాఖల అధికారులతో స్వర్ణాంధ్ర విజన్ కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)పైఆరా తీశారు వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా శాఖల వారీగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పనిచేయాల న్నారు. ఈ సూచికల్లో ప్రగతి మొత్తం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.

రీ సర్వే ప్రక్రియలో పురోగతి తక్కు వగా ఉందని ఆశించిన పురోగతిని సాధించాలని ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతు లకు ఆర్థిక సహాయం అందించే దిశగా పాటు పడాలన్నారు ప్రగతి సూచికల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవే క్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించి ఏడు సూచికలున్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి, ఆదాయానికి ప్రకృతి సాగు దోహదం చేస్తుందని, ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తుల సాధన అనేది ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కీలకమన్నారు.

మనతో పాటు భవిష్యత్తు తరాలు రోగాలు బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యమని వివరించారు. స్థానిక పరిస్థితులు, వనరులు ఆధారంగా రైతులను ఉద్యాన పంటలు దిశగా ప్రోత్సహించాలని.. జీవన ఎరువులు ఉపయోగించడం వల్ల ఎరువుల భారం తగ్గు తుందన్నారు. రైతులకు పంటల పెట్టుబడి ఖర్చులకు ఉపయోగపడేలా సీసీఆర్సీ కార్డుల ద్వారా సత్వరం బ్యాంకు రుణాలు మం జూరయ్యేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవా లన్నారు. ఎక్కడా రుణాలు మంజూరు కాలేదనే పరిస్థితి ఉండ కూడదన్నారు. వార్షిక రుణ ప్రణాళికల ఆధారంగా రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలోతాసిల్దార్ జి చినబాబు, మండల వ్యవసాయ అధికారి కడలి ధర్మారావు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు మండల సర్వేర్ పెద్దిరాజు విఆర్వోలు గ్రామ సర్వేలు పాల్గొన్నారు