బెల్టు షాపులు పై కన్నెర్ర చేసిన: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా- అమలాపురం జూలై 26:

ప్రభుత్వం నిర్దేశించిన లైసె న్సులు జారీ చేసి మద్యం దుకాణాలు ద్వారానే మ ద్యం విక్రయాలు నిర్వహిం చాలని, బెల్టు షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా ఎక్సైజ్ సిబ్బంది పటిష్ట పర్య వేక్షణ చేపట్టాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు.. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు ఎక్సైజ్ శాఖ సూపర్ అంటే సర్కిల్ సబ్ ఇన్స్పెక్టర్లతో సమా వేశం నిర్వహించి జిల్లాలో మద్యం విక్రయాల పై సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ఉన్న ఆరు సర్కిల్లో 146 మద్యం షాపులు పది బార్లు ఒక టూరి జం రెస్టారెంట్ బార్ ఉన్నాయ న్నారు. సమయపాలన పాటించడంతోపాటు అక్రమ మద్యం కల్తీ మద్యం విక్రయాలు రవాణాలు జర గకుండా నిరోధించాలన్నారు. మాదక ద్రవ్యాలు ఆల్క హాల్ కలిగి న మందులకు సంబంధిం చిన చట్టాలను పటిష్టంగా అమలు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాల న్నారు అక్రమ మద్యం ఉత్పత్తి, రవా ణాను నిరోధించి, అక్రమ మాదక ద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యం నాటు సారా తయారీ దారులపై ప్రత్యేక దృష్టి సారించి నియం త్రణ చర్యలను బలోపేతం చేయాలన్నారు. షాపు వద్ద కొనుగోలు చేసి నేరుగా తీసుకుని చర్యలు తీసు కోవాలని చుట్టుపక్కల ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చూడాలన్నారు మద్యం అమ్మకాలకు అవసరమైన లైసెన్సులను జారీ చేస్తూ మద్యం దుకాణాలు లైసెన్సు షరతులను నిబంధనలను పాటిస్తున్నాయో లేదో తరచుగా తనిఖీలు చేప ట్టాలన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే పన్నులను వసూ లు చేస్తూకల్తీమద్యం, అక్రమ మద్యం రవాణా అమ్మకాలను పూర్తిగా అరికట్టాలన్నారు మద్యం అమ్మకాల సమయాలు, ధరలు, విక్రయ పద్ధతులు వంటి వాటిని పర్యవేక్షించాల న్నారు ప్రభుత్వం నిర్ణయించిన. MRP ధరలకు మించి అమ్మకుండా చూడాల న్నా రు దేవాలయాలు, పాఠశాల లు, ఆసుపత్రులు వంటి సున్నితమైన ప్రాంతాలకు దగ్గరలో మద్యం దుకాణా లు ఉండకూడదనే నిబం ధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విజిలెన్స్ అండ్ స్క్వాడ్ తని ఖీలు నిర్వహిస్తూ నిబంధ నలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకో వాలన్నారు నవోదయం 2.0 కార్యాచరణను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచే స్తున్నట్లు ఎక్సైజ్ సూపర్ ఇంటెండెంట్ ప్రసాద్ తెలిపారు. కొమరగిరి పట్ట ణంలో ఇటీవల లూజ్ మద్యం విక్రయాలు పై ఒక కేసును నమోదు చేసి విచా రించినట్లు తెలిపారుఈ కార్యక్ర మంలో ఆరుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఒక స్క్వాడ్ ఇన్స్పెక్ట ర్ ఎస్సైలు పాల్గొన్నారు

Related Articles

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ […]

పచ్చిమాల వివాహ వేడుకల్లో గన్నవరపు సందడి.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 14: పశ్చిమాల సుబ్బారావు కుమార్తె వివాహ వేడుకల్లో గన్నవరపు శ్రీనివాసరావు సందడి చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

పోలీస్ అమర వీరుల స్థూపం వద్ద ఘనంగా సంస్మరణ దినోత్సవం మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఘన నివాళి

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 21: సురక్షిత సమాజ నిర్మాణం లో పోలీసులు పాత్ర ఎంతో ముఖ్యమని రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి […]