ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ:పి జ్యోతిలక్ష్మి దేవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 26:


ఎస్సీ ఎస్టీ నర్సింగ్ మహిళలకు జర్మనీ భాష నందు ఉచిత శిక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళా నర్సింగ్ పట్టభ ద్రులకు రాష్ట్ర ప్రభుత్వం జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించనున్న దృష్ట్యా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొ రేషన్, గిరిజన సంక్షేమం, సామాజిక సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం లోని శిక్షణ కేంద్రాల్లో జరుగనుందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం ఉచిత జర్మన్ భాషా శిక్షణ అందించనున్నారన్నారు. 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు అర్హులనీ. వీరికి పదినెలల పాటు శిక్షణ ఇవ్వనున్నార న్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజన సౌకర్యం ఉచిత వసతి కల్పిస్తార న్నారు. డాక్యుమెంట్ల అనువాదం, అటెస్టేషన్ ఖర్చులు, బీ2 జర్మన్ భాష పరీక్ష ఫీజు, వీసా, విమాన టికెట్ల ఖర్చులు ఉద్యోగదా రులు భరిస్తారన్నారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.2.4 లక్షల నుంచి రూ.3.1 లక్షల వరకు జీతం లభిస్తుందన్నారు ఆసక్తి ఉన్నవారు జనన ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, నర్సింగ్ డిప్లొమా సర్టిఫికేట్, బీఎస్సీ సర్టిఫికేట్(గ్రేడ్/రేటింగ్), నర్సింగ్ లైసెన్స్ వర్క్ ఎక్స్పరియన్స్ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్, వాలిడ్ పాస్పోర్ట్, మ్యారేజ్ సర్టిఫి కేట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 075 తేదీలోపు https://naipunyam.ap.gov.in/userregi stration?page=program-cregistration 3 నమోదు చేసుకోవాలనీ. లేదా skillinternational@apssdc.in రెస్యూమ్లు ఈమెయి ల్ చేయవచ్చుననీ 9988853335, 8712655686, 8790118349, 8790117279 నందు సంప్రదించాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

Related Articles

జోగేష్ కవిత్వంలో సౌందర్యదృష్టి,సామాజిక వాస్తవికత.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం, 4 అక్టోబర్ 2025: స్వీయానుభూతితో, సహానుభూతితో బడుగు భాస్కర్ జోగేష్రాసిన కవిత్వంలో సౌందర్యదృష్టికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ప్రాపంచిక వాస్తవికత పట్ల ఎరుకతోనే […]

చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభలో మాల కళాకారులు.

V9 ప్రజా ఆయుధం- గుంటూరు డిసెంబర్ 15:గుంటూరు నల్లపాడు లో ఆదివారం సాయంత్రం చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభ ప్రారంభమైంది. సభా వేదికపై మాల కళాకారులు మాలలను చైతన్య పరుస్తూ జానపద […]

అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతర పోరాటం యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఏప్రిల్ 11: బడుగు వర్గాల ఆశాజ్యోతి, అట్టడుగు వర్గాల అణచివేతకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన యోధుడు మహాత్మ జ్యోతిభా పూలే ఎందరికో స్ఫూర్తి […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు ప్రఖ్యాతులు రాష్ట్ర, జాతీయ స్థాయికి: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 22: విద్యాభ్యాసంతో పాటుగా క్రీడలలోను క్రీడా స్ఫూర్తి, పోటీతత్వంతో క్రీడా ప్రతిభను చాటుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]