బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25:

ఆర్థిక అసమానతలను మాపేందుకు మార్గదర్శకుల సహకారంతో బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు రాష్ట్ర స్థాయి అధికారులు అమ రావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పి4 కార్యక్రమం ద్వారా జీరో పేదరికం సాధన దిశగా చేప ట్టాల్సిన చర్యలు గూర్చి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో సమున్నత ఉన్నత ఆశ యంతో చేపట్టిన పి4 కార్యక్రమాన్ని దిగ్విజ యంగా అమలు చేయ డానికి గ్రామా లలో ఉన్నత స్థితిలో ఉన్న ధనికులను పారిశ్రామికవేత్తలను విదేశాలలో స్థిరపడిన ఎన్ఆర్ఐ లను గుర్తించి బంగారు కుటుం బాల అవసరాలను తీర్చేందుకు పది అంశాల ప్రశ్నావళితో కూడిన నివేదిక ఆధారంగా బంగారు కుటుంబాల దార్శనిక డాక్యుమెంటును రూపొందించి మార్గదర్శకులకు బంగారు కుటుంబాలకు అందించి వారి అవసరాల ను తీర్చడం ద్వారా ఎంత తక్కువ సమయంలో జీవన ప్రమాణాలు మెరుగుపర చగలమో దిశగా ముందుకు సాగాలన్నారు. గతంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, జన్మ భూమి తదితర పథకాల ద్వారా సమాజం లో ఆర్థిక సాధికారతకు ఎంతో కృషి జరిగిందని అదేవి ధంగా ఎప్పటికీ వివిధ పరిశ్ర మలు ఆర్జించిన లాభా లలో రెండు శాతం నిధులు సమాజాభివృద్ధికి వేచ్చిస్తు న్నాయని వీటికి తోడు బి4 పథకం కూడా తోడైతే ఆశిం చిన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ప్రగాఢంగా విశ్వ సిస్టోoదని తెలిపారు. ఈ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దృష్టిని సారిం చి క్షేత్రస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పడుతూ సమాజంలో ఆర్థిక సాధికారతకు కృషి చేయాల న్నారు. ఆగస్టు 15 నాటికి మొదటి దశ దత్తత కార్యక్ర మాన్ని 15 లక్షల కుటుంబాలను రెండు లక్షల మార్గదర్శకులతో దత్తత నివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు ఆ దిశగా జిల్లాలో ఉన్న 65 వేల బంగారు కుటుంబా లను దత్తత నిచ్చేందుకు గ్రామ సభల ద్వారా మార్గ దర్శకులను ఎంపిక చేయా లని ఆదేశించారు. అదేవి ధంగా బంగారు కుటుంబాల అవసరాలను గుర్తిస్తూ అప్లో డ్ చేయాలని ఆదేశించారు. ప్రతి కుటుంబాన్ని అందరితో సమానంగా తీసుకునే విధంగా మంచి స్ఫూర్తితో సరైన సమయంలో ఆర్థిక చేయూతను అందించి మంచి ఎనర్జీని అందిస్తూ ప్రగతి పదంలో ఆయా కుటుంబాలను నడిపించి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ జీరో పేదరిక లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ప్రజానీకం లో ఈ కార్యక్రమ అమలు పట్ల చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూ సమాజంలో మం చి పనులు చేయాలను కునే వారికి స్థితిమంతులకు ఒక వేదికను ఏర్పాటు చేసి బంగారు కుటుంబాలను విజన్ డాక్యుమెంట్ ద్వారా దత్తతనివ్వాలని సూచించా రు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ జీవితంలో మంచి పనులు చేయాల నుకుంటారని అటువంటి వారికి ఇదొక చక్కటి సదా వకాశమనీ ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ జిల్లా ప్రత్యేక అధికారులు ఎమ్మె ల్యేలు విజన్ డాక్యుమెంట్ యూనిట్ల సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకుని లక్ష్యాలను చేరుకుంటూ ఆశించిన ప్రగతిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూ చించారు. ప్రభుత్వ పథకా లు నిరంతరాయంగా అందించడం జరుగు తుందని వాటికి అదనంగా పి4 కార్యక్రమం ఆర్థిక సపోర్టును ఇతరత్రా సహకారం అందిస్తుంద న్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ సహకా రంతో అంచలంచెలుగా ఎదగడం జరిగిందని, ఆత్మవిశ్వాసంతో తిరిగి మరల సమాజానికి ఇవ్వా ల్సిన బాధ్యత ఉందని ఆ సంకల్పంతో ముందుకు రావాల్సిన అవసరముo దన్నారు. సమాజ హితం కోసం సమాజాభివృద్ధికి ఈ స్ఫూర్తిదాయకమైన క్యాం పైన్లో ప్రతి ఒక్కరు ఆత్మ విశ్వాసంతో పాల్గొని ఆర్థిక అసమాన తలు రూపుమాపి పేదరిక నిర్మూలనకు ముం దుకు రావాలన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియను ఆయన స్పష్టం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా సుస్థిరాభివృద్ధి మెకానిజం కూడా వస్తుందన్నారు మానవతా విలువలు కూడా పెరిగి మంచి సమాజ స్థాప నకు ఈ విధానం ఉపకరి స్తుందన్నారు. త్వరలో కార్యక్రమ ప్రామాణిక విధివిధానాలు, మార్గదర్శ కాలు ప్రభుత్వం విడుదల చేయనున్నదన్నారు. బంగారు కుటుంబ దార్శనిక డాక్యుమెంట్ ప్రకారం తక్కువ సమయంలో జీవన ప్రమాణాలు పరచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related Articles

మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కు ఘన సత్కారం.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -రాజోలు డిసెంబర్ 17:చలో గుంటూరు మాలల సింహ గర్జన సభకు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర నేత గొల్లపల్లి సూర్యారావు సహకరించి, వాహనాలను సమకూర్చి సభను విజయవంతానికి కృషి […]

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త వహించాలి: డాక్టర్ కారెం రవితేజా MD

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మే 26: కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుంది పలు జాగ్రత్తలు తీసుకోవాలి అని, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

సునీత విలియమ్స్ నేటి యువతకు ఆదర్శం అభినందనలు తెలిపిన మంత్రి సుభాష్.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-రామచంద్రపురం//అమరావతి మార్చి 19: భారత సంతతి హ్యోమగామి సునీత విలియమ్స్ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. […]

మంద కృష్ణ పై పోలీస్ స్టేషన్ లో మాలమహానాడు ఫిర్యాదు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష డప్పులు వెయ్యి గొంతులు నినాదం మాల మాదిగలను రెచ్చగొట్టే విధంగా ఉందని. మందకృష్ణ పై వెంటనే కేసు నమోదు […]