
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25:

జీరో పేదరికమే లక్ష్యంగా పి 4 రీవాల్యుడేషన్ గ్రామ సభలు రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి, అర్హులను వారి అవసరాల డేటా ప్రక్రియ ఆన్లైన్లో ఈ నెలాఖరు నాటికి అప్లోడ్ చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మండల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఎంపీడీవో, 4 మున్సిపల్ కమిషనర్లు వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించి పి4 రీవాల్యుడేషన్ గ్రామసభలు ద్వారా బంగారు కుటుం బాల అవసరాలు గుర్తింపు, ముఖ్యమైన కార్యనిర్వహణ సూచికలు ( కేపిఐ) నిర్వహణ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పెర్ఫార్మెన్స్ సిస్టం (ఈటీపీఎస్)నందు వివరాలు నమోదు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సుపరి పాలన అందించే దిశగా అధునా తన సాంకేతికతను పరిపాలన విధానంలో జోడిస్తూ విధివిధా నాలను రూపొందించిందన్నారు.

ఆమెరకు ప్రతి అధికారి కె పి ఐ, ఈ టి పి ఎస్, స్వర్ణాంధ్ర పోర్టల్ నందు నిర్దేశిత డేటాను అప్లోడ్ చేయాలని తదనుగుణంగా డేటాను ప్రాసెస్ చేసి ఇస్తుం దన్నారు. జిల్లా వ్యాప్తంగా 65, వేల మంది బంగారు కుటుం బాలు ఉన్నాయని గ్రామసభల ద్వారా అర్హత కలిగిన వారిని గుర్తించి వారి యొక్క అవస రాలను తెలుసుకొని పోర్టల్ నందు అప్లోడ్ చేయాలన్నారు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు రోజులో ఒక గ్రామ సభను సందర్శించి ప్రక్రియను పరిశీలించాలని సూచించారు. గత రెండు నెలల క్రితం చేసిన సర్వే డేటాను డౌన్లోడ్ చేసుకుని వారిలో వివిధ కారణాలవల్ల మరణించిన, అనర్హులను అంగీకారం లేని వారిని గు ర్తించి తొలగిస్తూ అర్హులకు న్యాయం చేకూర్చాలన్నారు సచివాలయ సిబ్బందికి పోర్టల్ ద్వారా బంగారు కుటుంబాల అవసరాలు డేటా ఎంట్రీ విధివిధానాలపై ఎంపీడీవోలు అవగాహన పెంపొందించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడింగ్ విధానం పై అవగాహనను పెంపొందించారు. ముఖ్య మైన కార్య నిర్వహణ సూచికలు కార్యాలయ పని తీరును కొలిచేందుకు ఉపయో గించే గణాంకాల సూచిక అనీ, లక్ష్యాలను చేరుకున్న స్థాయిని నిర్ధారించేందుకు వినియోగిం చడం జరుగుతుందన్నారు. పౌర సేవలు అందుబాటు, ఫిర్యాదుకు స్పందించే సమయం గ్రామ సచివాలయంలో సేవలు, విద్యారంగంలో ఉత్తీర్ణత శాతం వంటి సర్వీసులకు ఉపయో గపడుతుంద న్నారు ఆ ప్రకారం జిల్లా స్థాయిలో కీ పారామీటర్ ఇండికేటర్స్ 139 ప్రభుత్వం నిర్దేశించిం దని ఆ ప్రకారం స్వర్ణాంధ్ర పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశిం చారు. ప్రతి శాఖలో ఉన్న కీ పారామీటర్ ఇండికేటర్స్ ను నమోదు చేయాలని ఆదే శించారు అదేవిధంగా మండల స్థాయిలో లాగిన్ అయ్యి 214 కి పారామీటర్ ఇండికేటర్స్ నమోదు చేయాలన్నారు. వీటి ఆధారంగా పనితీరును ప్రభుత్వం అంచనా వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వంలో కొన్ని శాఖల పనితీరు పర్యవేక్షణ కోసం ఎలక్ట్రా నిక్ ట్రాకింగ్ పెర్ఫార్మన్స్ (ఈటీపీఎస్) విధానాన్ని వినియో గిస్తున్నారన్నారు. ఇదొక డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థని, దీని ద్వారా వివిధ శాఖల విభిన్న పథకాలు కార్యక్రమాలు ఉద్యోగుల పనితీరు సేవలు అమల్లో పురోగతినీ రియల్ టైంలో ట్రాకింగ్ చేస్తుందన్నారు. గ్రామ సచివాలయాలు విద్య వైద్యం రెవెన్యూ, హౌసింగ్ రేషన్ పంపిణీ ఆరోగ్య సేవలు జిల్లాల వారీగా అధికారులు పనితీరు అంచనా, సీఎం డాష్ బోర్డు వంటి వ్యవస్థలతో అను సంధానం ద్వారా (ఈటీపీఎస్) డేటా ను పరిశీలిస్తారన్నారు. సేవల పూర్తి శాతం, ఇచ్చిన సేవలు శాతం, స్పందన వేగం, ఫిర్యాదుకు స్పందించడానికి తీసుకున్న సమయం, వివిధ స్థాయిలలో పనితీరు పరిపాల నలో పురోగతి, ఉద్యోగుల హాజరు, పనితీరు ప్రభుత్వ శాఖల సేవలపై పర్యవేక్షణ ఆడిటు సేవల ద్వారా జవాబుదా రీతనం పెంచేందుకు ఉప యోగపడుతుందన్నారు ఈ విధంగా ఎంపీడీవోలు, తాసిల్దార్లు ఒక్కొక్కరు 1500 డాక్యుమెంట్లను అప్లోడ్ చేయా లన్నారు వీటిలో రెవెన్యూ రికార్డులు కార్యాలయ సంబం ధిత కోర్టు తీర్పులు వివిధ డాక్యుమెంట్లు, నివేదికలు తీర్మానాలు పాలసీ విధానాలు తదితర కార్యాలయ సంబంధిత అంశాల డాక్యు మెంట్లను అప్లోడ్ చేయాలన్నారు. రానున్న పుష్క రాలకు సంబంధించి నియోజక వర్గ మండల ప్రత్యేక అధికా రులు ఫీల్డ్ ఫంక్షనరీస్ మరియు వివిధ శాఖల అధికారు లతో క్షేత్రస్థాయిలో పర్యటించి గత పుష్కరాలలో రేవు ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్యను బట్టి అంచ నాలు రూపొందిస్తూ మౌలిక వసతులు కల్పనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిశాంతి, డిఆర్ఓ రాజ కుమారి ఏవో కాశీ విశ్వేశ్వర రావు డి ఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర తదితరులు పాల్గొ న్నారు