

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15:

అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి ని జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లిలంక గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత చిట్టూరి శ్రీనివాస్ చౌదరి కు అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సంబందిత శాఖ ఉత్తర్వులు “జీవో” విడుదల చేశారు.
ఈ సందర్బంగా v9 ప్రజా ఆయుధం దినపత్రిక మరియు ఆన్ లైన్ వార్తల ప్రతినిధి నేరేడిమిల్లి వినయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుడు పంబల కృష్ణ అభినందన తెలిపిన వారిలో ఉన్నారు.