
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట జూలై 24:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట టౌన్ ఎస్ ఐ గా ఎన్ రాము బదిలీ అయ్యారు. ఆయన మండపేట లో ఇటీవల బాధ్యతలు స్వీకరించారు.
2012 బ్యాచ్ కు చెందిన ఈయన మరేడిమిల్లి, కాకినాడ సి సి ఎస్, రాజమండ్రి త్రీ టౌన్ లలో ఎస్ ఐ విధులు నిర్వహించారు. రావులపాలెం ఎస్ ఐ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌన్ లో ట్రాఫిక్ సమస్య పై దృష్టి సారించామని చెప్పారు. శాంతి భద్రత లు పరిరక్షణ కు కృషి చేస్తామని పేర్కొన్నారు.