V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 15:
గురువారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశమై రైతులపక్షాన వాణీ వినిపించిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంటు సభ్యులు బారత లోక్ సభ మాజీ స్పీకర్ జి.యం.సి బాలయోగి గారి ముద్దుబిడ్డ కోనసీమ అభివృద్ది ప్రధాత యువనేత జి.యం.హరీష్ మాధుర్ కు రాష్ట్ర తెదేపా హెచ్ ఆర్ డి సభ్యుడు నేదునూరి వీర్రాజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్ భూసేకరణకు సంబంధించి అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణ ప్రక్రియలో ఎదురైన లోటుపాట్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా చెల్లించాల్సిన నష్టపరిహారాల అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావించిన పార్లమెంటు సభ్యులు హారీష్ బాలయోగి.
రైతులకు న్యాయం జరగాలి అనే సంకల్పంతో రైతులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా చేసిన ఎంపి హరీష్. భూసేకరణ అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, క్లియరెన్స్ ప్రక్రియల వేగవంతం చేయాల్సిన విషయమై ఇప్పటికే కేంద్రీయ స్థాయిలో కొనసాగుతున్న చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగింది.