
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 05:
ఈనెల 6 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అర్జీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాక పోయినా, లేదా తమ ఫిర్యా దులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడా నికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవ డానికి “మీకోసం డాట్ ఏపీ డాట్ జివోవి డాట్ ఇన్” వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసు కోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం కోరాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 6 వ తేదీన సోమవారం స్థానిక కలెక్టరేట్ లోనీ గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వ హించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమా న్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిం చడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొం టారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబం ధించి అర్జీలను వ్రాత పూర్వకంగా అందజే యాలన్నారు సమస్య పరిష్కారమైనప్పుడు అర్జీ దారుని ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీ దారులు వారి ఫోన్ ను చెక్ చేసు కోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్సాప్ లో పంపడం జరుగుతుంద న్నారు.మండల, డివిజన్, పురపాలక సంఘ స్థాయిల లో పి జి ఆర్ ఎస్ కార్యక్ర మాలు ఆ యొక్క స్థాయి సమస్యల పై యధావిధిగా కొనసాగుతాయన్నారు. అర్జీదారులు కేవలం జిల్లాస్థాయిలో సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కలెక్టరేట్ నందుపిజిఆర్ఎస్ కార్య క్రమాన్ని సద్వినియో గం చేసుకోవాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.