
కోనసీమ కేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ కారెం రవితేజకు మండల మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనసన్మానం చేసారు డా.రవితేజకు “బెస్ట్ ఎక్స్లెన్స్ డాక్టర్ “అవార్డు వచ్చిన సందర్భంగా స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో ఆదివారం మండల మహానాడు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా గజమాలతోనూ,దుశ్శాలువాలతోను ఆయనను సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, కోనసీమ ఐ కేర్ డాక్టర్ పినిపే మహారాజ్ భూషణ్ , మాల మహానాడు అధ్యక్షుడు గిడ్ల వెంకటేశ్వరరావు, బొక్క రామచంద్రరావు,కొంకణి వెంకట రావు,జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు న్యాయవాదులు బడుగు భాస్కర్ జోగేష్ , పి.గన్నవరం నియోజకవర్గం టిడిపి అధికార ప్రతినిధి మెల్లం సత్యనారాయణ, కాశీ సత్యనారాయణ,,వార లక్ష్మీ నరసింహారామ్ , మోర్త సత్తిబాబు,కుసుమ బహుగుణ, వస్కా శ్యాంసుందర్, కుమ్మరి రమణ, పిల్లి కన్నబాబు,జనసేన నాయకుడు మద్దాచంటిబాబు, గుర్రాల రాంబాబు, కుంచే నాని, వజ్రపు బాల కుమార్, పాము సత్యనారాయణ,మద్దెల వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

