

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అంబాజీపేట జూలై 17:


పి.గన్నవరం అంబాజీపేట: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం స్థానిక పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టూరి శ్రీనివాస్ చౌదరి,పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు గిడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ కార్యవర్గ నియామకం పూర్తిగా నిబంధనలకు లోబడి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చేపట్టామన్నారు.గత ప్రభుత్వ హయాంలో కంటే మార్కెట్ కమిటీ అభివృద్ధి చెందే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు కమిటీ గౌరవ అధ్యక్షుడు గిడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.