కొబ్బరి రైతాంగం అభివృద్ధి సంక్షేమాన్ని కి సాంకేతిక టెక్నాలజి: బోర్డు చైర్మన్ శుభా నాగరాజన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం జనవరి 12:

కొబ్బరి రైతాంగం అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షించి కొబ్బరి అభి వృద్ధి బోర్డు హైబ్రిడ్ వంగడాలు సస్యరక్షణ అధిక దిగుబడులు సాంకేతిక టెక్నాలజీ ఆచరణ అంశాలకు పెద్దపీట వేస్తోందని కొబ్బరి అభివృద్ధి బోర్డు చైర్మన్ శుభా నాగరాజన్ తెలిపారు. ఆదివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావులపాలెం సి ఆర్ సి కన్వెన్షన్ హాల్ నందు 45 వ కొబ్బరి బోర్డు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొబ్బరి రైతుల అభ్యుదయానికి సౌభాగ్యానికి బోర్డు పలు పథకాలను అమలు చేస్తుందన్నారు జనవరి 12 న స్వామి వివేకానంద జయంతి కూడా జరుపు కోవడం సంతోషకరమన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు తమిళనాడు, కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలలో కొబ్బరి సాగు కొబ్బరి పరిశ్రమ అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ సమన్వయం, కొబ్బరి అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు పథకాలు అమలే లక్ష్యం గా 1981 జనవరి 12న కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటయిందన్నారు.

కొబ్బరి విలువ ఆదారిత పరిశ్రమల సమగ్ర అభి వృద్ధికై పలు కార్యక్రమా లను అమలు చేస్తుంద న్నారు ప్లాంటేషన్, కొబ్బరి సాగు, విస్తీర్ణం పెంపు కొబ్బరి ఉత్పాదకత పెంపు సమగ్ర సేద్యపు పద్ధతులు సాంకేతిక ప్రదర్శన క్షేత్రాలు,నాణ్యమైన పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు, కొబ్బరి మార్కెటింగ్ విస్తృతి, విస్తరణ టెక్నాలజీ మిషన్ లో భాగంగా బోర్డు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తూ సాంకేతిక నైపుణ్యా లను రైతులకు అందుబాటులో తెస్తోందన్నారు. స్థానికంగా లభించే కొబ్బరి కాయలను మాత్రమే విక్రయించు కోవడం ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో తగిన ఆదాయం స్థానిక కొబ్బరి రైతాంగానికి లభించడం లేదన్నారు.

ముడిసరుకు ఆధారంగా ప్రాసెసింగ్ కొరకు పరిశ్ర మల క్లస్టర్లు, పార్కులు ప్రభుత్వ ప్రోత్సాహకాల తో ఏర్పాటు చేసుకుని అధిక ఆదాయం పొందాలని ఆయన రైతులకు సూచించారు. కొబ్బరి బోర్డు సాంకేతిక నైపు ణ్యాల అభివృద్ధి కే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో
పాటుగా తోటల్లో వ్యాపించే తెగుళ్లు చీడపీ డల నిర్మూలన అనువైన సమగ్ర సాంకేతిక పద్ధతు లు కొబ్బరి ప్రాసెసింగ్,(శుద్ధి )వివిధ రకాల ఉత్పత్తులు సాగించడం విస్తరించడం మార్కెట్ పరిశోధనలు ప్రోత్సా హకరించడం వంటి అంశాలలో బోర్డు అన్ని విధాల సహకరిస్తుందన్నారు.

మేలి రకం కొబ్బరి మొక్కలను తక్కువ ఎత్తు లోనే అధిక దిగుబడి వచ్చే రకాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని అదేవిధంగా తోటల పున రుద్ధరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడిం చారు. ఉత్పాదకత పెరుగుదల ఎగుమతుల ప్రోత్సాహం తోటలకు దింపుడు కార్మికులకు భీమా పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహ కారంతో నిర్వహించడం జరుగుతుందన్నారు. బోర్డు సీఈవో ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ స్థానికంగా కొబ్బరి విలువ ఆధారిత పరిశ్ర మల ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు బోర్డు కొబ్బరి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా నిలిచి కొబ్బరి రైతు అభివృద్ధి సంక్షేమానికి భరోసాను కల్పిస్తుంద న్నారు రైతులు ఈ యొక్క అవకాశాలను సద్విని యోగపరుచు కుని అధిక దిగుబడుల ను పొందుతూ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఉత్పత్తులు అధికంగా ఉన్నప్పటికీ రైతు ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా పరిశ్రమల పార్కులను ఏర్పాటు చేసుకుంటే కొబ్బరి ఆధారిత వస్తువులకు మార్కెటింగ్ సౌలభ్యం బోర్డు ద్వారా కల్పించడం జరుగుతుందన్నారు కొబ్బరిలో చాలా రకాల ఉత్పత్తులు చేపట్టేందుకు ఆస్కారం ఉందన్నారు మల్టీ క్రాపింగ్ ,మల్టీ ప్లాంటేషన్ పద్ధతుల ద్వారా తోట్ల పెంపకం వల్ల అధిక దిగుబడులు ఆర్జిం చవచ్చునన్నారు. రైతు సంక్షేమమే పరమావధిగా బోర్డు పనిచేస్తుందన్నారు వైయస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయ ఉపకులపతి కే గోపాల్ మాట్లాడుతూ బోర్డు యొక్క బాధ్యతలు విధులు గూర్చి రైతులకు విశదీకరించారు.

నాణ్య మైన కొబ్బరి ఉత్పత్తులు స్థానికంగా ఉన్నాయని విశ్వవిద్యాలయం అను సంధానంతో మరింతగా కోనసీమ ప్రాంతంలో కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులను మెరుగు పరిచేందుకు తోడ్పాటు ను అందించడం జరు గుతుందన్నారు. రైతులు కూడా సమిష్టిగా ముందు కు వస్తే విశ్వవిద్యాలయ అధికారులు అన్ని విధా లుగా సహకరిస్తారన్నారు. దశాబ్దాలుగా కొబ్బరి రైతులు అభివృద్ధికి కొబ్బరి పరిశోధన కేంద్రం బోర్డు ఎంతగానో శ్రమి స్తుందన్నారు కొబ్బరిలో ఆశించే ముఖ్యమైన తెగుళ్లను గుర్తించి మందులను సరఫరా చేస్తున్నామని పాత రోగాలు మరల పునరా వృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. జీవ ని యంత్రణ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించ డం జరుగుతుందన్నారు. స్థానిక యూనివర్సిటీ పరిశోధన కేంద్రంలో ప్లాంటేషన్ మెటీరియల్ ఇంకా పెంచాల్సిన అవ సరం ఉందన్నారు.

నీటి యాజమాన్య పద్ధతులపై కూడా రైతుల అవగాహన పెరగాలన్నారు స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు మాట్లాడుతూ కొబ్బరి బోర్డు చల్లని చూపు ఈ ప్రాంత రైతాంగంపై మెండుగా ఉండాలని ఆశించారు తమిళనాడు కేరళలో మాదిరిగా దిగుబడులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కోనసీమ ప్రాంతానికి బోర్డు సభ్యులు మెరుగైన ఎనలేని సేవలు అందించాలన్నారు. జిల్లాలో సుమారు లక్ష, 25 వేలు ఎకరాల లో కొబ్బరి సాగు ఉందని ఈ ప్రాంత రైతాంగ మనుగడలో కొబ్బరి కీలక భూమిక పోషిస్తుందన్నారు. వ్యవసాయదారిత ప్రాంతం కోనసీమ జిల్లా అని ఈ మధ్యకాలంలో కొబ్బరి తోటలు కనుమ రుగవుతున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగుపై తగిన సహకారం అందించాలని కోరారు.

బోర్డు కూడా ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యే క దృష్టి సారించాలన్నా రు బోర్డు ద్వారా ఆదు కోవడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయన్నా రు. ఇప్పటికైనా బోర్డు సానుకూలంగా స్పందించి రైతాంగ సంక్షేమానికి ముందడుగు వేయాలని కోరారు. ఈ ప్రాంత రైతాంగం కొబ్బరి తోటలు మొక్కుబడే అనుకుని అంతర్ పంటల సాగులో జీవనాధారం పొందుతు న్నారన్నారు. పూర్తిగా కొబ్బరిపై రైతుకు న్యా యం జరగడం లేదని స్థానికంగా కొబ్బరి ఈనెలు దగ్గర నుండి మొత్తం ఉత్పత్తుల తయారీకి అనువైన పరిశ్రమల క్లస్టర్లు పార్కులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా బోర్డు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెలిపారు 1996లో తుఫాను మూలంగా కొబ్బరి లో చోకిన వ్యాధులు ఇప్ప టికీ కొనసాగుతూనే ఉన్నాయన్నారు.

కొబ్బరి రైతులు పూర్తిగా ఆదు కోవలసిన సమయం ఆసన్నమైనదన్నారు.100 కొబ్బరికాయలు దిగుబడి వస్తే దింపుకు వలుపుకు 40 కాయలు ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. దింపుకు వలుపుకు సంబంధించి ఇన్నోవేటివ్ సాంకేతికతకు అనుగు ణంగా పరికరాలను అందుబాటులోకి తేవాలన్నారు. రైతాంగానికి పెట్టుబడి ఖర్చులు తగ్గించి అధిక దిగులు వచ్చే విధంగా అన్ని విధాల ఇతోదికంగా ప్రోత్సహించాలన్నారు. హైబ్రిడ్ వంగడాలు సమగ్ర పోషకాలు సబ్సిడీలపై అందించాలన్నారు. వేసవిలో నీటి యజ మాన్య పద్ధతులను ఆచరించేందుకు డ్రిప్ ఇరిగేషన్ మరియు నీరు సరఫరా చేసే మోటార్లుకు సౌర విద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు బోర్డు సహాయం అందించాలన్నారు. రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం లో ఏటా ఇరవై కోట్ల కొబ్బరికాయలు దిగుబడి తో 200 కోట్లు టర్నోవర్ జరుగుతుందని గుజరా త్, కేరళ చతిస్గడ్ మాదిరిగా మార్కెటింగ్ సౌలభ్యం మెరుగుపరచాలన్నారు సరైన గిట్టు బాటు ధర కల్పించాల న్నారు.

బేసిక్ గా నాలుగు రకాలు ఉత్పత్తులపై దృష్టి మరల్చి ఆ దిశగా పరిశ్రమల క్లస్టర్ ఏర్పా టుకు తమ నియో జకవర్గంలో తూర్పు కాలంలో 25 ఎకరాలు భూమిని కేటాయించా మని ఆ దిశగా బోర్డు చర్యలు చేపట్టాలని కోరారు. స్థానికంగా కొబ్బరి వస్తువులు వినియోగాన్ని మెరు గుపరిచేందుకు బోర్డు చర్యలు చేపట్టాలన్నారు. ధరల స్థిరీకరణకు విలువ ఆధారిత వస్తువుల తయారీకి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటుకు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. చివరి నియోజకవర్గం కావ డంతో డ్రైనేజీల వల్ల కాలుష్యం పెరిగిపోయి కొబ్బరి చెట్లు చనిపోతు న్నాయని దీనిపై కూడా బోర్డు తగిన విధంగా స్పందించి నష్టాల నివా రణకు చర్యలు చేపట్టా లన్నారు. కొబ్బరి చెట్టు నష్టపరిహారాన్ని రూ 2,500 వరకు పెంచాల న్నారు. కేటాయించిన బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలకు 200 కోట్లు ఈ విధంగాను సరిపోదన్నారు ఏపీ కొబ్బరి అభివృద్ధి బోర్డు విజయవాడ నుండి పరిపాలన వికేంద్రీకరణ సూత్రానికి అనుగుణంగా రాజోలు నియోజకవర్గం లో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

మాజీ బోర్డు అధికారి మినీ మాడ్యూ ఐఏఎస్ మాట్లాడుతూ స్థానికంగా కొబ్బరి ముడిసరుకు నాణ్యమైనది లభిస్తు న్నప్పటికీ మధ్య దళారీలు ఆయా ముడి పదార్థాలనే కొనుగోలు చేసి విలువ ఆధారితంగా మార్చుకుని లాభాలను గడుస్తున్నారని అవే చిన్న చిన్న పరిశ్రమలు స్థాని కంగా ఏర్పాటు చేసు కున్నట్లయితే ఆ యొక్క లాభాలను కూడా స్థానిక రైతాంగానికి రైతు ఉత్ప త్తిదారుల సంఘాల కు లభిస్తాయని ఆ దిశగా రైతులు ముందుకు వచ్చి బోర్డు సహకారంతో అభివృద్ధి పథంలో పయ నించాలన్నారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఒకప్పుడు కొబ్బరి ఆదాయ వన రుగా ఉండేదని ఇప్పుడు గిట్టుబాటు ధరలు కూడా సన్నగిల్లాయని పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో పెట్టి రైతులకు అండగా నిల వాలని సూచించారు కష్టకాలంలో ప్రతి రైతులు ఆదుకునే దిశగా బోర్డు పనిచేయాలని ఆకాంక్షించారు. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు అన్నింటిని కోనసీమ ప్రాంతానికి తీసుకుని వచ్చి అభ్యుదయ పదంలో జిల్లాను ముం దుకు నడిపించాలన్నారు

ఉద్యాన విశ్వవిద్యాల యం అదనపు సంచా లకులు సి బి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది బోర్డు ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ నిధులు కేటాయించిందని ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయన్నారు కొబ్బరి సాగు పునరు ద్ధరణ అదనంగా రాష్ట్రం లో1000 ఎకరాలు విస్త రణ కు చర్యలు కొనసాగు తున్నాయన్నారు. మిషన్ ఇంటిగ్రేటెడ్ ఆర్టికల్చర్ డెవలప్మెంట్ మరియు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా కూడా ఉద్యాన సాగు అభివృద్ధి జరుగుతోందన్నారు సస్యరక్షణ జీవ నియం త్రణ తదితర సాంకేతి కపరమైన కార్యక్రమాలపై రైతులకు అవగాహన పెరగాలన్నారు తక్కువ భూమిలో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడులను సాధిం చేందుకు విశ్వవిద్యాల యం బోర్డు కృషి చేస్తు న్నట్లు తెలిపారు. రేట్లు తక్కువగా ఉన్న సందర్భంలో కొబ్బరి ఉత్పత్తుల నిల్వకు ప్యాక్స్ హౌసులను రాయితీలతో ప్రోత్స హించడం జరుగుతుందన్నారు.

స్థానికంగా కొబ్బరి ఉత్పత్తులలో కోనసీమ జిల్లా ముందంజలో ఉన్నప్పటికీ ప్రాసెసింగ్ విధానంలో చాలా వెనుకబడి ఉందని ఈ నేపథ్యంలో పరిశ్రమల పార్కులు క్లస్టర్లు రాయి తీలతో ప్రోత్సహించిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు సీవీ త్రినాథ్ రెడ్డి కే శ్రీనివాసులు ఆకుల రామకృష్ణ జీడి పుల్లారెడ్డి బి.వి.రమణ ఏ దుర్గేష్ బోర్డు సభ్యులు విశ్వవి ద్యాలయ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

మార్కెట్ దేవాదాయ నామినేటెడ్ పదవుల సీఎం చంద్రబాబు ప్రకటన

నామినేటెడ్ పదవులపై సీఎం చంద్రబాబు ఒక ప్రకటన చేశారు . టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సాధికార కమిటీ సభ్యులకే పదవులు ఇస్తామన్నారు. […]

జూన్ 1 నుంచి డీలర్లు రేషన్ దుకాణాలు వద్దే నిత్యావసరాలు పంపిణీ// జాయింట్ కలెక్టర్ టి నిషాoతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 23: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత పారదర్శకంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునః ప్రారంభించి కార్డుదారులకు […]

తెలంగాణపై అల్పపీడన ప్రభావం

తెలంగాణపై అల్పపీడన ప్రభావంతోపలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.

శానపల్లిలంక లో ఘనంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలు.

ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పెన్నా లు పంపిణీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 23:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు […]