


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 15:

రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ సయ్యపరాజు వెంకట సత్యనారాయణ రాజు “పోతుకుర్రు సత్తిబాబు” ను V9 మీడియా మర్యాదపూర్వకంగా కలిసింది.

ఏపీ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి సయ్యపరాజు వెంకట సత్యనారాయణ రాజు “పోతుకుర్రు సత్తిబాబు” ను ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ మంగళవారం పోతుకుర్రులో ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రజా ఆయుధం దినపత్రిక న్యూస్ పేపర్ ప్రింటింగ్ ముద్రణ యంత్రం ముమ్మిడివరం లో ఏర్పాటుకు సంబంధించిన విషయాలను డైరెక్టర్ సత్తిబాబు రాజుతో జర్నలిస్ట్ వినయ్ కుమార్ పంచుకున్నారు.

దినదిన అభివృద్ధి పొందాలని ప్రజా సమస్యల వైపు పత్రిక నడవాలని ఆయన సూచించారు.అయితే ప్రజా ఆయుధం మీడియా సంస్థ కు ఆది నుంచి అండదండగా ఉన్నందుకు వినయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోతుకుర్రు మాజీ సర్పంచ్ గుమ్మళ్ళ శ్రీనివాస సాగర్, కే జగన్నాధపురం మాజీ సర్పంచ్ మరియు అంబాజీపేట మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మోర్త సత్తిబాబు, కళాశాల అద్యాపకులు పంబల కృష్ణ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మెల్లం సత్యనారాయణ తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు ను క్షత్రీయ కార్పోరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు చిరు సత్కారం చేశారు.