


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 15:

ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం నేత రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ మంగళవారం ఆయన స్వగృహం ముమ్మిడివరంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా అరుదైన పర్యావరణ వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన అడవి జాతి మొక్కను అందించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లెక్చలేర్ పంబల కృష్ణ మరియు సహసర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అశోక్ పుట్టినరోజుకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నలుమూలల నుండి భారీగా అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి పుట్టినరోజు కేకు కోసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.