మేజిక్ రాజాకు పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డ్

ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను మరో అవార్డు వరించింది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవార్డులు.. సన్మానాలు-సత్కారాలు అందుకున్న మేజిక్ రాజా ఖాతాలో మరో అవార్డు చేరింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా, కవిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, వెంట్రిలాక్విస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రతిభ కనబరుస్తూ.. ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలు అందించినందుకుగాను అతిథులు మేజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి, పీసీ సర్కార్ (సీనియర్) మెమోరియల్ అవార్డును అందజేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికులు పిసి సర్కార్ (సీనియర్) జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఆర్కే వండర్ వరల్డ్, తెలంగాణ మేజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో గురువారం రాత్రి అత్యంత ఘనంగా నిర్వహించిన వరల్డ్ మెజీషియన్స్ డే వేడుకలలో..హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఇంద్రజాలికులు బీవీ పట్టాభిరాం, మేజిక్ స్టార్ బోస్, సీవీ రమణ, మర్రి రమేష్, స్టిక్ మనోహర్, నాగేశ్వర్ రావు, జీ.రఘుబాబు, డా. రమ్యశ్రీ, ఆంజనేయులు, కళ్యాణ్, ఫణిమాధవ్ కస్తూరి తదితరులు మేజిక్ రాజాను గజమాలతో ఘనంగా సన్మానించి, పీసీ సర్కార్ (సీనియర్) మెమోరియల్ అవార్డ్ ను అందజేసి, అభినందించారు. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలువురు ప్రతిభావంతులు, సీనియర్ ఇంద్రజాలికులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. గోదావరిఖనికి చెందిన మేజిక్ రాజాకు చోటుదక్కడం విశేషం. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ భారతీయ ఇంద్రజాలాన్ని అంతర్జాతీయ వేదికపై సగర్వంగా నిలిపిన పీసీ సర్కార్ (సీనియర్) పేరిట అవార్డును అందుకోవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. కాగా రాజా అవార్డును అందుకోవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్, స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్, రామగుండం కళాకారుల సంక్షేమ సంఘం, నియర్ అండ్ డియర్, రామగుండం ఏరియా యూ ట్యూబర్స్ అసోసియేషన్, గోదావరి సరిగమలు సంస్థల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Related Articles

ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావం దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కలెక్టర్ ఆర్ మహేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 18: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావంపై దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని […]

ప్రకృతిని -పరి రక్షిద్దాం పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం:సర్పంచ్ సయ్యపరాజు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి అక్టోబర్ 18: ప్రకృతిని – పరి రక్షిద్దాం పరిసరాల పరిశుభ్రతను పాటిద్దాం,అని పోతుకుర్రు సర్పంచ్ సయ్యపరాజు సుబ్బలక్ష్మి పిలుపునిచ్చారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి […]

ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులు: కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 05: ఉపాధ్యాయులు జీవిత మార్గదర్శకులు సమాజ నిర్మాణ శిల్పులని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ […]

అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు, రమణీయత ఎంతో ఆహ్లాదకరం: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ఆత్రేయపురం డిసెంబర్ 21: అఖండ గోదావరి నది ప్రాంతం ప్రకృతి అందాలు, రమణీయత మధ్య ఎంతో ఆహ్లాదకరంగా పర్యాటకులను కను విందు చేస్తోoదని డాక్టర్ […]