
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 14:

కార్యకర్తలే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఎక్సైజ్ మరియు మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, దాట్ల బుచ్చిబాబు,ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం , రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ అన్నారు.ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన గ్రామం గ్రంధి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో వీరంతా పాల్గొన్నారు.

అనంతరం కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.