
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండుకుదురు గుర్రాలవారిపేట లో కల్వరి విమోచన మహోత్సవ సభలు పాస్టర్ ఆకుల ఆహ్వానం మేరకు 7,8,9,10 తేదీలలో జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ మరియు శాసనసభ్యులను ఆత్మీయ అతిథులుగా మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఆయన తనయుడు డాక్టర్ కారెం రవితేజా , ముఖ్య అతిథులుగా కృష్ణ పద్మరాజు లను ఆహ్వానించారు. ఈ సభలకు చివరి రోజు శుక్రవారం రాత్రి,అమలాపురంలో ప్రసిద్ధిగాంచిన కోనసీమ కేర్ రెమర్జెన్సీ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా విచ్చేశారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ… ఈ సభలకు పిలిచిన సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు, తదుపరి ఆయన దైవ సందేశం ఇచ్చారు. సభ అనంతరం డాక్టర్ రవితేజకు శాలువా కప్పి పూల మాలలతో సత్కరించారు.