
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జూలై 14: ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు:

జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇటీవల అగ్ని ప్రమాదానికి గురై సర్వం కోల్పోయిన అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామానికి చెందిన కుంచె శాంతమ్మ మరియు వాసంశెట్టి పెద్ది రాజు కుటుంబాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) మరియు అమలాపురం ఎమ్మార్వో పి. అశోక్ ప్రసాద్ చేతుల మీదుగా వంట సామాగ్రి, టార్పాలిన్, రగ్గు, బియ్యం ,కూరగాయలు, బట్టలు, అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జాయింట్ ట్రెజరర్ జల్లి సుజాత , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బీ.వీ. హనుమంతరావు , ఓ. బాలరాజు , పట్నాల రమణ , శేఖర్ గారు, బి. శివరాం, గ్రామ సర్పంచ్ నక్క అరుణకుమారిశేఖర్ , వీఆర్వో భాస్కర బాలాజీ మరియు గ్రామ పెద్దలు బి. నరసింహారావు , చల్లంగి శ్రీనివాస్ , భాస్కర రావు , వీరం శెట్టి పాల్గొన్నారు.