

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కొత్తపేట జూలై 14:

ప్రజా సంతృప్తి కొలమానంగా ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నూటికి నూరు శాతం అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కార మార్గాలు ఉండాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహే ష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సంద ర్భంగా అర్జీదారుల నుండి సుమారుగా 4 అర్జీలను జిల్లా కలెక్టర్ ఆర్డిఓ పి శ్రీకర్ లు స్వీకరించారు. వీటిలో ఒకటి బొబ్బర్లంక ఏటిగట్టు ఆక్రమణలను తొలగించాలని మరొకటి కొత్తపేట గ్రామంలో కౌశిక్ ట్రైన్ శుభ్రపరచాలని కొత్తపేట మండలానికి సంబంధించి రెండు భూ సమస్యలపై దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను సంతృప్తి స్థాయి లను మెరుగుపరిచి ప్రజలకు సుపరిపాలనను చేరువ చేసే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని ఆదేశించి నట్లు తెలిపారు.

అధికారు లు తమకు అందిన అర్జీని క్షేత్రస్థా యిలో పూర్తిగా అర్జీదారుని సమక్షంలో విచారించి అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెందిన పిదప ఆన్లైన్లో ఎండార్స్మెం ట్ చేయాలని సూచించా రు. రాష్ట్ర ప్రభుత్వం ఐ వి ఆర్ యస్ ద్వారా అర్జీదా రుల సంతృప్తి స్థాయి ప్రజాభిప్రాయ నివేదికను సేకరిస్తుందని అర్జీని పూర్తి స్థాయిలో పరిష్కరిం చని పక్షంలో అర్జీదారుడు సంతృప్తి చెందలేదని ఐవిఆర్ఎస్ ద్వారా తెలియజేసినట్లయితే మరల అదే అర్జీ పునరా వృతం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు కావున ప్రజా సంతృప్తి కొలమానంగా ప్రతి అర్జీకి నూటికి నూరు శాతం పరిష్కార మార్గాలు అందిం చాలని ఆయన స్పష్టం చేశారు.

అదేవిధంగా అర్జీలు పరి ష్కారంలో ఎటువంటి జాప్యాలకు తావు అర్జీలు దాఖలు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సుపరిపాలనను ప్రజలకు చేరువు చేసే దిశగా ప్రభు త్వం ప్రతి స్థాయిలో ప్రజా భిప్రాయాలను సేకరించి పరిశీలన చేస్తుందని కావున అధికారులు అంకితభావం జవాబు దారితనం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటిం చారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాంబాబు, డివిజన్ స్థాయి అధికా రులు తదితరులు పాల్గొ న్నారు.

కొత్తపేట జూలై 14: స్థానికంగా రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, మరియు డివిజన్ స్థాయి అభివృద్ధి అధికారి కార్యాలయాల ఏర్పాటుకు భూసేకరణకై చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న భూములను ఆయన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు వారితో కలిసి ఆర్ డి ఓ డి ఎల్ డి ఓ కార్యాలయాలు ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ రెవిన్యూ అధికారి పి శ్రీకర్ తాసిల్దార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పి గన్నవరం జూలై 14: గోదావరి నది వరదల సందర్భంగా గోదావరి నది దాటడానికి రేవుల వద్ద అన్ని జాగ్రత్తలు చర్యలు పాటించాలని మరి తీవ్ర ఉధృతంగా ప్రవహించిన సందర్భంలో భద్రతా చర్యల దృష్ట్యా రాకపోక లను పూర్తిగా నిషేధించా లని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదే శించారు. సోమవారం మండల పరిధిలోని గంటి పెదపూడి రేవు ప్రాంతాన్ని ఆయన అధికారుల బృం దంతో కలిసి గోదావరి వరద స్థితిగతులను స్వ యంగా పరిశీలించారు .

పంటి పడవల మీద ప్రయాణించేటప్పుడు గజ ఈతగాళ్ల తో పాటుగా లైఫ్ జాకెట్లు ఇతర జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలని, 24/7 ప్రతి కాజ్వే వద్ద అధికారులను నియమించి వరద సహా యక చర్యలు హెచ్చరిక అనుగుణంగా చేపట్టేందుకు ఏర్పాటు చేయడం జరిగిం దన్నారు. వరదలు నేప థ్యంలో అధికారులు సూచనల తో మాత్రమే కాజ్వేల వద్ద ప్రయాణాలు నిర్వహించాల్సి ఉంటుంద న్నారు. వరద ప్రమాద హెచ్చరికలకు సంబంధించి ధవలేశ్వరం దిగువకు వదు లుతున్న వరదనీటి స్థాయిలపై గంట గంటకు సమాచారం అందుతుం దని ఆ దిశగా సహాయక చర్యలను చేపట్టేందుకు అధికారులను నియమిం చడం జరిగిందన్నారు. ముంపు బాధితుల సహాయార్థం నిత్యవసరాలు పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకర్ డిఆర్డిఏ పిడి సాయి నాథ్ జై చంద్ర గాంధీ స్థానిక రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు