సమన్వయంతో అధికారులు ప్రజాప్రతినిధులు
పనిచేయాలి: ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 18:

డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ కోనసీమ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధి కారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మరియు వ్యవసాయ సహకార, మార్కెటింగ్ పశుసంవర్ధక డైయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్ననాయుడు పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో ప్రాథమిక రంగ సెక్టార్, వాటి అనుబంధ రంగాలైన వ్యవసాయం, నీటిపారుదల, పశుసంవ ర్ధనం, డైయిరీ డెవల ప్మెంట్ ఉద్యాన, మత్స్య విభాగాల తోపాటుగా ఉచిత ఇసుక పాలసీ ద్వారా ఇసుక సరఫరా, ధాన్యం కొనుగోలు, జ లవనరులు ప్రక్రియ, దీపం 2 పథకం, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యు మెంట్ తదితర అభివృద్ధి అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ మంత్రి మాట్లాడుతూ కోనసీమ జిల్లా అన్ని రకాలుగా సర్వతో ముఖాభివృద్ధి సాధి స్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఈ విష యంలో అధికారులు ప్రజాప్రతినిధులు పరిపూ ర్ణంగా సమన్వయంతో సహకరించాలని మంత్రి కోరారు.

జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించేందుకు అందరి మద్దతు అవసరమ న్నారు వ్యవసాయంలో అధునాతన సాంకేతికత నూతన వరి వంగడాలు హైబ్రిడ్ కొబ్బరి వంగడా లను అందించి వ్యవసా యాన్ని లాభసాటిగా మార్చాలన్నారు స్థానిక ప్రజానీకానిక తలసరి ఆదాయం రూ. లక్ష 80వేలుగా ఉండి 22వ స్థానంలో నిలిచిందని దీన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు విశాఖ పట్నం విజయవాడలో తలసరి ఆదాయం రూ. రెండు లక్షల 70 వేలుగా ఉందన్నారు. వ్యవసాయ ఆధారి త జిల్లాగా పేరు గాంచిన కోనసీమ జిల్లాలో వ్యవ సాయ అనుబంధ రంగా ల కొబ్బరి ఉత్పత్తులను విలువ ఆధారితoగా మార్చే పరిశ్రమల స్థాప నకు పారిశ్రామిక వేత్తల ను ఆహ్వానించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రాజోలు తూర్పు పాలెం నందు కొబ్బరి ఆధారిత ఎం ఎస్ ఎం ఈ రాయి తీలతో ప్రోత్సహించి ఉపాధి స్వయం ఉపాధి అవ కాశాలు కల్పించి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన కోనసీమ జిల్లాలో హర్బర్లు, జెట్టీలు, ఫిష్ లాండింగ్ సెంటర్లు ఏర్పా టుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వ యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు .

పర్యాటకారంగానికి జిల్లా ఎంతో అనువైనదని ఆ దిశగా గ్రోత్ ఇంజన్ ప్రణాళికలతో ఒక ఏజెన్సీ ని తీసుకుని వచ్చి అమ లు చేయటానికి తన వం తు ప్రయత్నం చేస్తాన న్నారు. టెంపులు సముద్ర ఏ ప్రాంతాలతో సర్క్యూ ట్ టూరిజంకు చర్యలు చేపడతామని తద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశా లతో పాటు ఆదాయం వస్తుందన్నారు. నరేగా పనులు స్థానికంగా లేవని నరేగాలో అదనంగా కాలువ డ్రైనేజీ పూడిక తీతలు జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు గుర్తిస్తూ ప్రతిపాదించి చేపడితే పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ లభించి గ్రా మాలు సర్వతో ముఖ అభివృద్ధికి మార్గం సుగ మం అవుతుందన్నారు.

వ్యవసాయం వాటి అనుబంధ రంగాలైన ఆక్వా కల్చర్ పై కూడా దృష్టి సారించి ఆక్వా జోన్ అభివృద్ధితోపాటు గా నాన్ ఆక్వా జోన్ నిబం ధనలను తూచా తప్ప కుండా పాటిస్తూ అక్రమ చెరువులకు ప్రభుత్వ రాయితీలను నిలుపుదల చేయాలని సూచించారు. ఏడాది పొడవునా మూ డు పంటలు పండే సార వంతమైన భూములు ఆక్వా చెరువు లు కింద మారకుండా ప్రభుత్వ నిబంధనలను తప్పనిస రిగా అమలు చేయాల న్నారు. వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా లేని పల్లంగా ఉన్న చౌడు పర్ర భూములను మాత్రమే ఆక్వా జోన్లో తీసుకోవాల న్నారు స్థానికంగా జిల్లా కార్యాలయాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తొందరగా తీసుకోవాలని తాత్సారం చేయకుండా నూతన జిల్లా అభివృద్ధికి అంకు టిత దీక్షతో పనిచేయాల ని సూచించారు. ముందు గా రోడ్లు విస్తరణ చెందితే అభివృద్ధి అనేది సాధ్య పడుతుందన్నారు. కౌలు దారులకు ఆమోదయో గ్యమైన చట్టాన్ని ప్రభు త్వం త్వరలో తీసుకు రానున్నదన్నారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నకు సమాధామిస్తూ రాయవరం అమలాపురం రైతు బజార్లు ఎస్టేట్ అధికారులను నియమిం చి పున ప్రారంభించాలని ఆదేశించారు. రైతులు ఖరీఫ్ వరి సాగు మూలంగా తుఫాన్లు వరదలు మూలంగా కొంతమేర నష్టాలు చవిచూస్తూ ఆ యొక్క నష్టాన్ని రబీలో భర్తీ చేసుకునేందుకు సమా యత్తం అవుతున్నారని ఆ దిశగా అధికారులు మంచి వంగడాలు పుష్కలంగా ఎరువులు బఫర్ స్టాకులు పెట్టుకొని డిమాండ్కు అనుగుణం గా సరఫరా చేయాలన్నా రు.

కోకోనట్ బోర్డుల కార్యాలయాలు స్థాని కంగా ఏర్పాటు చేసేం దుకు చర్యలు చేపడ తామని తద్వారా కొబ్బరి పరిశ్రమ ల ఏర్పాటుకు సౌలభ్యం ఏర్పడుతుం దన్నారు. ఏడు ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు అభి వృద్ధికి చర్యలు తీసుకుం టామన్నారు. తుఫాన్లు వరదలు సమయంలో పశువులకు పశుగ్రాస కొరత ఏర్పడకుండా వరిగడ్డిని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని పశువులకు అవసరమైన మందులు ఆన్లైన్ లో ఇండెంట్ పెడితే సరఫరా చేయడం జరుగుతుంద న్నారు. జలవనరుల శాఖ సమీక్షలో సుదీర్ఘకాలంగా కాలువలు డ్రైనేజీలలో పూడికతీతలు పనులు సంబంధించి ఎమ్మెల్యేలు అధికారులు సమన్వ యంతో ప్రాధాన్యత క్రమంలో ఆమోదయోగ్య మైన పనులు ప్రతి పాదిస్తే నిధులు సమీకరణకు పై స్థాయిలో చర్యలు చేపడ తానని తెలిపారు.

ఫిబ్రవ రి నెలలో ప్రతిపాదనలు సమర్పించాలని కాలువ లు మూసివేత సమయం లో పనులు నిధులు ము రిగిపోకుండా పనులు పూజ చేయాలన్నారు. సముద్రపు పోటు మూలంగా సముద్రపు నీరు పొలాలలోకి రాకుం డా అవసరమైన షట్టర్లు మార్పు, అదేవిధంగా సముద్రపు పోటు లేని సందర్భంలో మురికినీరు సముద్రంలోకి వెళ్లే విధం గా అవసరమైన మర మ్మత్తు చర్యలకు ప్రతి పాదనలు రూపొందిం చాలన్నారు అమలాపు రం దిగువ భాగంలో ఐదు గ్రామాలలో మురికి నీరు ఉండే స్క్రాంపును సర్వే చేసి మురికి నీరు నిలు వలు లేకుండా సజావుగా పారేవిధంగా సమన్వయంతో పాటుపడాలన్నారు. ప్రతి అభివృద్ధి అంశంలో సంబంధిత ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అధికారులు చర్చించుకుని ఆమోద యోగ్యంగా ప్రతిపాదనలు రూపకల్పన చేసి సమర్పించాలన్నారు.

ప్రభు త్వం ధాన్యం సేకరణ ప్రక్రియ ఎంతో ప్రతిష్టాత్మ కంగా నిర్వహిస్తోందని ధాన్యం సొమ్ములు కేవలం 24 గంటల్లోనే రైతు ఖాతాకు జమవుతున్నా యని కదా అనుకూలంగా ప్రతి గింజ ప్రభుత్వానికి అమ్మాలని రైతులు నిర్ధారించుకో వడంతో అదనపు టార్గెట్ల ను కోరాల్సిన పరిస్థితి నెలకొందని ఆ దిశగా టార్గెట్లను పెంచుతామ న్నారు వచ్చే సమీక్షలు త్రాగునీరు మిగిలిన అంశాలను క్షుణ్ణంగా సమీక్షించడం జరుగు తుందన్నారు.

జిల్లాలో ఉన్న 12 ఇసుకరీచులలో 8 రీచ్ ల ద్వారా ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు సహకా రంతో ఇసుక త్రవ్వకాల ప్రారంభించి డిమాండ్ కు అనుగుణంగా ఇసుక సరఫరాకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. కోస్టల్ రీజియన్ జోన్లో కొన్ని గ్రామాలు ఉండటం మూలంగా ఇసుక తవ్వ కాలు సాధ్యపడవన్నారు. జిల్లా యొక్క పరిస్థితు లపై అవగాహనకు రావ డం జరిగిందని ఇకపై జిల్లా అభివృద్ధికి దృష్టి సారిస్తానని మంత్రివర్యు లు స్పష్టం చేశారు. గౌరవ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రశ్నకు సమాధానమిస్తూ పంచాయతీ కార్యద ర్శులు నియామకాలు జీవో ప్రకారం చేపట్టింది లేనిది తనిఖీ చేయాలని కలెక్టర్ వారికి సూచించారు.

జిల్లాలు విభజన జరిగినప్పటికీ పూర్వపు జిల్లా నుండి చాలామంది అధికారులు నూతనంగా ఏర్పడిన జిల్లాలో దిగువ శ్రేణి ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని వీరికి పూర్తి అధికారాలు బదలా యించలేదని సంతకా లకు పాత జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందని దీనిపై రేపటి క్యాబినెట్ సమావే శంలో సమీక్షిస్తానని ఆయన స్పష్టం చేశారు కొబ్బరి విలువాదారిత పరిశ్రమల నెలకొల్పడం ద్వారా స్థానిక ప్రజానీకా నికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండేలా ఎo ఎస్ ఎం ఇ పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.నిరుపేదలు పేదరికాన్ని జయించే విధంగా సమ గ్రంగా సంక్షేమ పథకాల ను వర్తింప జేస్తూ అంతి మంగా పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అధి కారయంత్రాంగం పని చేయాలని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవ సాయశాఖ మంత్రి అన్నారు.నీటి పారుదల ప్రాజెక్టుల మరమ్మ త్తు పెండింగ్ పనులను త్వరి తగతిన పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధి కారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవ సరమైన నిధులు ప్రభు త్వం నుంచి మంజూరు చేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ జిల్లాలో ఇప్పటి వరకు వివిధ రంగాల్లో సాధిం చిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఇన్చార్జి మంత్రి వర్యులకు వివరించారు. చివరిగా కోనసీమ జిల్లా విజన్ @2047 డాక్యు మెంటును మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీలు ఐ వి రావు, తోట త్రిమూర్తులు కే సూర్యనారాయణ రావు, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు, అయితా బత్తుల ఆనంద రావు దేవ వరప్రసాద్ గిడ్డి సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు పాల్గొ న్నారు,