కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం : జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, మార్చ్ 01:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న కోటిపల్లి – నర్సాపురం రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని జిల్లా జాయిం ట్ కలెక్టర్ టి నిషాoతి అధికారులను ఆదేశించా రు శనివారం స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్ నందు రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి రైల్వే లైన్ ఏర్పాటులో భూ సేకరణ నష్టపరిహారాల చెల్లింపు, నష్టపరిహారాల పెంపు పై తీసుకున్న చర్యలు నూతన అలైన్మెం ట్, సమగ్ర కార్యాచరణ నివేదికలు ట్రాఫిక్ సర్వే ఎక్విప్మెంట్ ఏర్పాటు తదితర అంశాల పురో గతిపై సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆమె మా ట్లాడుతూ రైల్వే ఇం జనీర్లు రెవిన్యూ అధికారులు సమన్వ యంతో రైల్వే లైన్ ఏర్పాట్లు ఉత్పన్న మైన సమస్యలను పరిష్కరిం చుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచిం చారు మళ్లీ భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణ పనులను ప్రారం భించేలా చర్యలు చేప ట్టాలన్నారు ఇప్పటికే రైల్వే లైన్లో ఏర్పాటులో భాగంగా భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలోని భూమిని రైల్వే అధికారు లు స్వాధీన పరుచుకొని రైల్వే నిర్మాణ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు అయినవిల్లి అమలా పురం రూరల్ మండల గ్రామాలలో రైల్వే లైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయిందన్నారు. రెవెన్యూ అధికారులు ఆయా ఆగ్రామాలలో భూ సేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి హద్దులను సూచిస్తూ రైల్వే అధికారులకు అప్పగించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు
దక్షిణ మధ్య రైల్వే పరిధి లో కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ పనులలో ఉత్పన్నమైన వివిధ సమస్యలను అధికారులు సమన్వయంతో దశల వారీగా అధిగమిస్తూ రైల్వే ట్రాక్ నిర్మాణంలో ఆశించిన పురోగతిని సాధిస్తూ కోనసీమ ప్రాంత వాసుల చిరకాల వాంఛ ను నెరవేర్చాలన్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కాకినాడ నుండి విజయవాడకు ప్రత్యామ్నాయ రెండో రైలు మార్గం అమలా పురం మీదుగా ఏర్పాటు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ చీఫ్ ఇంజనీర్ కే సూర్యనారాయణ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఏ బద్దయ్య, సహాయ కార్య నిర్వాహక ఇంజనీర్ పి అర్జున్ రావు, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి ఆర్డీవోలు పి శ్రీకర్, కే మాధవి ఉప తాసిల్దార్ ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఆటో డ్రైవర్లు కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే ఆనందరావు

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆనందరావు గారి మాటలు స్టేటస్ పెట్టుకుంటున్నాం: ఆటో యూనియన్ సత్తిరాజు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 04: ఆటో డ్రైవర్లు కుటుంబాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు […]

అల్లు అర్జున్ బెయిల్ మంజూరు

సినీ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది. పుష్ప2′ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన […]

అమలాపురంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై పటిష్ట నిఘాతో పాటుగా డెకాయ్ ఆపరేషన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం డిసెంబర్ 26:గర్భస్థ పిండ ఆరోగ్య పరిశీలన కొరకు వినియోగించే ఆల్ట్రా స్కానింగ్ వైద్య పరీక్షలను లింగ నిర్ధారణకు దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ […]

గుంటూరులో పోలీసులకు హర్ష కుమార్ వార్నింగ్

గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]