
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -అమలాపురం ఏప్రిల్ 23:

కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు లక్షిత వర్గాలకు అందించడంలో అధికారులు కీలక భూమిక పోషించాలని స్థానిక పార్లమెంట్ సభ్యులు జి హరీష్ మాధుర్ అన్నారు.

జిల్లా పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాలతీరు తెన్నులు, సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కలెక్టరేట్లో బుధవారం జరిగిన దిశ జిల్లాస్థాయి అభివృద్ధి సమన్వయ మానటరింగ్ కమిటీ సమావేశం విభాగాల పరిధిలో కేంద్రం అమలు చేస్తున్న మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన,, జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన, ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన, నేషనల్ హెల్త్ మిషన్, పీఎం పోషణ్, , సంసద్ ఆదర్శ గ్రామ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి విశ్వకర్మ పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర ప్రాయోజిత పథకాల తీరు తెన్నులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సామా న్యుల ఆర్ధిక స్వావలంబనే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలన్నారు సామాన్యులు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహిస్తూ, వారికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. అభివృద్ధి పరంగా విభిన్న చర్యలు చేపడుతూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తూ, విస్తృత అవగాహన కల్పించా లన్నారు జిల్లాలో ప్రజలను చూస్తున్న సమస్యలను అధికారులకు వివిధ పథకాల అమలులో జరుగుతున్న జాప్యా లపై ఆరా తీసి వాటిలో పరిపాలన పరమైన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు.

15 ఆర్థిక సంఘం నిధులతో ప్రాధాన్యత పనులకు పెద్ద పేట వేయడం జరుగుతుందన్నారు. వివిధ పథకాల అమల్లో నిధులు వినియోగంపై మౌలిక సదుపాయాలు కల్పనపై చర్చించడం జరిగిందన్నారు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా చిట్టచివరి లబ్ధిదారుల వరకు లబ్ధిని చేకూర్చాలని ఆదేశించారు రుణాల కల్పనలో లబ్ధిదారులకు ఉన్న సమస్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు.

ప్రజా ప్రతినిధులు అధికారుల సమక్షంలో ఫలవంతమైన సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకు క్రమం తప్పకుండా దిశ మీటింగ్ నిర్వహిస్తూ అర్హులందరికీ లబ్ధిని మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. తలసరి రోజువారి సగటున 55 లీటర్లు సురక్షితమైన నీటిని అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పనులను మరిం త వేగవంతం చేసేందుకు చర్యలు గైకొన్నామన్నారు. జాతీయ రహదా రులు రైల్వే లైన్ ఏర్పాటు ద్వారపూడి రైల్వే స్టేషన్ లో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్ధిగా వినియోగించాలని, లబ్దిదారులకు పూర్తి స్థాయిలో ఫలాలు అందేలా చర్యలు తీసు కోవాలన్నారు. పలు అంశాల్లో అనుసరించాల్సిన పద్దతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు..

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ మండలాల ప్రజలకు అత్యంత లబ్ధి చేకూర్చే గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అధిక పని దినాలు కల్పించేలా, పూర్తి వేతనం అందిం చేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన అందరికీ సామాజిక పింఛన్లు తప్పకుండా అందించాలని, అనర్హుల గుర్తింపులో శాస్త్రీయ విధానాలను అవలంభించాలని సూచించారు.

ఔత్సాహికులకు పరిశ్రమల శాఖ నుంచి పూర్తి సహకారం అందించాల న్నారు. అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ లో చేర్చాలని, వారికి అండగా నిలవాలన్నారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాల న్నారు. ప్రకృతి వ్యవ సాయ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, డయేరియా లాంటి వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్తలు వహించాలన్నారు.

జిల్లా వాసులకు పరిశుద్ధమైన తాగునీరు అందించాల న్నారు. క్రీడా మైదానా లను అభివృద్ధి చేయాలని, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే స్థాయికి మన మైదానాలు ఉండేలా చర్యలు చేపట్టాలని, దానికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు. విద్యా రంగంలో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందిం చాలని సూచించారు. వినియోగదారులకు విద్యుత్ రాయితీ వచ్చేలా, దీపం పథకంలో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి వెనువెంటనే నగదు జమ అయ్యేలా పర్యవేక్షణ చేయాలని చెప్పారు.

అనర్హుల పింఛన్లు గుర్తించే క్రమంలో జాగరూకత వహించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అనర్హుల పింఛన్లు గుర్తించే క్రమంలో అధికారులు జాగరూకత వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు సామాజిక పింఛన్ల అంశంపై జరిగిన సమీక్షలో భాగంగా ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలను వెల్లడించారు. అర్హుల విషయం లో ఎలాంటి పొరపాటు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు మండపేట శాసనస భ్యులు అంచనాల కమిటీ చైర్మన్ వి జోగేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనానికి మూలాధారం త్రాగునీరు పారిశుధ్యం అత్యంత కీలకమన్నారు ఆసుపత్రులలో ప్రసూతి వైద్యుల ఖాళీలను నిం పాలని కోరారు.

నరేగా పధకం అమలులో ప్రస్తుతం ఉన్న సరాసరి పని దినాల సంఖ్య 48 ను వంద రోజులకు పెంచుతూ జిల్లా గ్రామీ ణాభివృద్ధిలో అభివృద్ధి చెందేలా చొరవ చూపాలన్నారు. ప్రస్తుత వేసవి కాలంలో అమృత్ సరోవర్ చెరువుల అభివృద్ధి పథకానికి చర్యలు ముమ్మరం చేయాలన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా గడ్డి సేకరణకు ఉపాధి పనుల ను అను సంధానం చేయాలని కోరారు ప్రభుత్వ సేవలలో 100% నాణ్యత కనిపించాలన్నారు భవిష్యత్తు అభివృద్ధికి డేటా ఆధారిత పాలన కీలకమని సూచించారు

ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు సూర్యఘర్ పథకాన్ని రాయితీలతో ప్రోత్సహించి ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలన్నారు నైపుణ్య శిక్షణల ద్వారా ఆర్థిక ప్రగతికి పాటుపడాలన్నారు పీఎం శ్రీ పాఠశాలలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి కాంపోనెంట్ వారిగా వసతులను మెరుగుపర చాలన్నారు. విద్యార్థి బంగారు భవిష్యత్తుకు ప్రాథమిక విద్య పునాద న్నారు కోనసీమ జిల్లా 10వ తరగతి పరీక్షల్లో 91. 3% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలనకు మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేయాలన్నారు కేంద్ర జనరంజక పథకాల ద్వారా పేదరిక నిర్మూలన దిశగా ముందడుగు వేయాలన్నారు.

2027 నిర్వహించనున్న పుష్కరాలకు నియోజ కవర్గాల స్పెషల్ ఆఫీసర్ల సమా వేశం నిర్వహించి పుష్కర రిక్వైర్మెంట్ నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వారిని కోరారు డొక్కా సీతమ్మ మధ్యా హ్నబడి భోజనం ద్వారా విద్యార్థుల పోషకాహార స్థాయిలను మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో వివిఎస్ లక్ష్మణ్ రావు ప్రజా ప్రతిని ధులు జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.