V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-సూళ్లూరుపేట తిరుపతి జనవరి 13: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మతకముడి గ్రామ శివారులో కోడిపందాల నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఏమాత్రం తగ్గలేదు పందాల నిర్వాహకులు. సమాచార అందుకున్న సూళ్లూరుపేట సిఐ మురళీకఅష్ణ ఆదేశాల మేరకు ఎస్సైబ్రహ్మనాయుడు నేతఅత్వంలో స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 20 కోళ్లు, 5,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 7 గురిని అరెస్టుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ దాడుల్లో తడ ఎస్సై కొండప్ప నాయుడు, సూళ్లూరుపేట, తడ పోలీస్ సిబ్బంది పాల్గన్నారు. కోడిపందాలు చట్టపరంగా నిషేధించబడ్డాయి.నిషేధించిన ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గనే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు. ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఇచ్చలవిడిగా అధికారులను లెక్కచేయకుండా కోడిపందాలను నిర్వహిస్తున్నారు.అలాగే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో అయితే కోడి పందాల నిర్వహకులకు అడ్డుఆపు లేదు. ఎవరైతే నాకేంటి అంతా మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరును బట్టి కోనసీమ ప్రజానీకం, అధికారులు అంతే అన్నట్టుగా పెదవి విరుస్తున్నారు.
కోడిపందాలు పై పోలీసులు ఉక్కు పాదం 20 కోళ్లు,5,800 నగదు,6 మోటార్ సైకిల్ స్వాధీనం.
January 13, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం అతీశీ
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. […]
విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయి తెలుసు కోవాలి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక అమలాపురం నవంబరు 22: *విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల* *స్థాయి తెలుసు కోవాలి* విద్యార్థిని విద్యా ర్థుల్లో అభ్యసన సామ ర్ధ్యాల స్థాయిని తెలుసు కునేందుకు […]
డైరెక్టర్ సత్తిబాబు కు ఘణ సన్మానం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జూలై 14: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ గా నియమితుడైన మోర్త […]
అమలాపురం పట్టణం ఎస్ కే బి ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్
కేంద్రాలలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పట్టభద్రులు