

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 11:

ప్రపంచవ్యాప్తంగా జనాభా కు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడిం చారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రపంచ జనాభా దినోత్సవం పుర స్కరించుకొని ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ జనాభా పెరుగుదల సవాళ్లు మరియు అవకాశాల గురిం చి అవగాహన పెంచడం లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి స్థిరమైన అభివృద్ధి, వనరు లకు సమాన ప్రాప్యత, పునరుత్పత్తి హక్కులు మరియు లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. జనాభా దినోత్సవం, పెరుగుతున్న ప్రపంచ జనాభా వల్ల కలిగే క్లిష్టమైన సమస్యలపై దృష్టి ని ఈ దినోత్సవం ఆకర్షిస్తుం దన్నారు భారతదేశం వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలుగా మారుతున్నం దున, ఆరోగ్యం, విద్య అందరికీ సమాన అవకా శాలను కలిగించే సమ్మెలిత విధానాలపై దినోత్సవాన్ని పురస్కరించుకుని సమగ్రం గా చర్చించాలని సూచించారు 2025 సంవ త్సరానికి న్యాయమైన ఆశాజనకమైన ప్రపంచంలో యువత కోరుకునే కుటుం బాలను సృష్టించడానికి వారిని శక్తివంతం చేయడం, ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యక రమైన సమయం మరియు అంతరం అనే ఇతివృత్తoతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి నుండి ర్యాలీని నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం దుర్గారావు దొర తెలిపారు.. ఈ సంవ త్సరం యువతకు కుటుంబ నియంత్రణ గురించి సమా చారంతో కూడిన నిర్ణయా లు తీసుకోవడానికి దృష్టి కేంద్రీక రించాలన్నారు అవసరమైన సాధనాలు, సమాచారం వనరులను అందించడంపై స్థిరమైన సమ్మిళిత భవిష్యత్తును నిర్మించడంలో కీలకమైన పునరుత్పత్తి ఎంపికలలో స్వేచ్ఛ, భద్రత గౌరవాన్ని నిర్ధారించ డానికి ప్రపంచ వ్యాప్త ప్రయ త్నాలను ఈ థీమ్ నొక్కి చెబు తుంద న్నారు. జనాభా దినోత్స వం జనాభా ధోరణులు పర్యా వరణం, ఆర్థిక వ్యవస్థ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రజలకు అవగా హన పెంపొందించాలన్నారు. వాతా వరణం, ఆహార సరఫరా, నీటి వనరులు, గృహనిర్మాణం మరియు మౌలిక సదు పాయా లపై అధిక జనాభా ప్రభావాన్ని హైలైట్ చేయాలన్నారు . కుటుంబ నియంత్రణ మరియు పునరుత్పత్తి ఆరోగ్య సేవలను పొంద డాన్ని ప్రోత్సహించడం. ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ ద్వారా లింగ సమానత్వానికి మద్దతు ఇవ్వడం వంటి చర్చలు నిర్వహించామన్నారు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్స హించడం పట్టణ ప్రణాళి కను మెరుగు పరచడం.బాధ్యతాయుతమైన జనా భా విధానాలు సామాజిక సంక్షేమ సంస్కరణలను ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వా లను ఈ దినోత్సవం ప్రేరేపించి గుర్తు చేస్తుంద న్నారు.భవిష్యత్ తరాలకు జీవన నాణ్యతను నిర్ధారిస్తూ వృద్ధిని బాధ్యతా యుతంగా ఎలా నిర్వహిం చాలనే దాని గురించి ప్రపంచవ్యాప్త సంభాషణ తూ కూడిన ప్రసంగాలు నిర్వహిం చడం జరిగిందన్నారు ముఖ్యంగా యువతను శక్తివంతం చేయడం వనరులు జనాభాను బేరీజు వేస్తూ జనాభా సమతుల్య తను పాటించే సమిష్టి భాగ స్వా మ్యాన్ని ఈ దినోత్సవం గుర్తు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్వో భరత్ లక్ష్మి, డి ఐ ఓ . సత్యనారాయణ ఐసిడిఎస్ పిడి శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు