

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజమండ్రి జూలై 09:

స్మార్ట్ డయాగ్నస్టిక్ సంస్థ ఎండి నేరేడుమిల్లి ప్రసాద్ ను V9 మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ బుధవారం రాజమండ్రి స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పటల్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. V9 ప్రజా ఆయుధం మీడియా కు ఆది నుంచి స్మార్ట్ డయాగ్నస్టిక్ సంస్థ అన్ని విధాల సహకరిస్తూ వెన్నుముకగా ఉంది. త్వరలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ప్రజా ఆయుధం దినపత్రిక ను అందించడానికి ముద్రణ యంత్రం న్యూస్ ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు ప్రయత్నానికి,తమ వంతుగా యధావిధిగా సహకరించాలని వినయ్ కుమార్ ఎండి ప్రసాద్ ను కోరారు. దానికి సానుకూలంగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ప్రజా ఆయుధం విజిటింగ్ కార్డు స్మార్ట్ హాస్పటల్ మేనేజర్ లక్ష్మణ్ మరియు డయాగ్నొస్టిక్ స్టాప్ సమక్షంలో ఆవిష్కరించారు.

ప్రజలకు అత్యంత సరసమైన ధరకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే ఏకైక లక్ష్యంతో 2021లో అంకితభావంతో పనిచేసే నిపుణుల బృందంతో స్మార్ట్ డయాగ్నస్టిక్ సెంటర్లు రాజమండ్రి, కొత్తపేట, ముక్తేశ్వరం ప్రాంతాలలో స్థాపించారు.
