
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాయవరం జూలై 26:

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధన దిశగా ముందుకు సాగుతుందనీ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖామంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు శని వారం మండల పరిధిలోని చెల్లూరు గ్రామంలో సుమా రు రూ 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సచి వాలయం 3 భవనాన్ని స్థానిక శాసనసభ్యులు అంచ నాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. అనంతరం నరేగా నిధులైన 90 లక్షల తో నూతనంగా నిర్మించ నున్న పంచాయ తీరాజ్ డ్రైన్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం రూ 1.31 కోట్ల అంచనాలు వ్యయంతో నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా రూ 86.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఇంటింటికి మంచినీటి కొళాయి పథ కాన్ని ప్రారంభించారు. సుమారు రూ 69 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న మహిళాశక్తి భవనం శంకుస్థాపన భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి రాష్ట్ర ప్రజల ఆలోచ నలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ రాష్ట్రాన్ని అభ్యుదయ పదంలో నడిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు తీసుకుని వచ్చేలా ఆర్థికంగా పూర్తి సహకారం అందిస్తోందన్నారు. పోలవరం అమరావతి ఇతరత్రా కార్యక్ర మాలకు నిధులను సమకూ రుస్తోందని తెలిపారు. అభివృద్ధి ప్రదాతగా ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధికై రేయింబవళ్లు శ్రమి స్తూ స్వర్ణాంధ్ర సాధనకై కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.