అమలాపురంలో అల్లాడ స్వామి నాయుడు.ఘనంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం

V9ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 18: అమలాపురం జిల్లా కేంద్రం మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లోని అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పించిన ఎడల ప్రణాళికా బద్దంగా నా వంతు సహకారం అంది స్తానని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశువర్ధక డైరీ డెవలప్మెంట్ మత్స్య శాఖల మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు.

బుధవారం స్థానిక మెట్ల రామలక్ష్మి కళ్యాణ వేదిక నందు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులుగా అల్లాడ స్వామి నాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యంగా పాల్గొని మాట్లాడుతూ అముడా అధ్యక్షులుగా రాజకీయంగా 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఆ దిశగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ మరింత వేగం పుంజుకోనున్నదని ఆయన ఆకాంక్షించారు.

పార్టీలో కష్ట పడి పని చేసే కార్యకర్తలను గుర్తించి ప్రభుత్వం నామి నేటెడ్ పదవులను కేటాయిం చడం అభినంద నీయమన్నారు. ప్రస్తుతం నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయని రాబోయే రోజులలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికలు, జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలు, మార్కెటింగ్ సొసైటీలు టెంపుల్ కమిటీలు కూడా రానున్నాయని తెలిపారు. నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మౌలిక వసతులు పరంగా మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రతి నియోజకవర్గం లోనూ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పించిన యెడల మంజూరు దిశగా ఇన్చార్జి మంత్రిగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి దిశగా గ్రోత్ ఇంజన్ మాదిరిగా నిర్ణయించడం జరిగిందన్నారు. తదనుగుణంగా ప్రత్యేక దృష్టిసారించి ముం దుగా మౌలిక వసతులు కల్పనకు చర్యలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలలో రోడ్ల అభివృద్ధి కి కార్లపై ప్రయాణించే వారు హర్షించే విధంగా పిపిటి మాదిరిగా టోల్ ఫీజు వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రాజెక్టు రూపొందించేందుకు యోచన చేస్తున్నారని, ద్విచక్ర వాహ నాలు ట్రాక్టర్లు ఆటోలు, వంటి వాటిపై టోల్ ఫీజు ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక ఆదర్శమైన జిల్లాగా త యారీకి అందరూ సమిష్టిగా దృష్టి పెట్టాలని సూ చించారు.

ముందుగా రోడ్ల విస్తరణ డివైడర్లు లైటింగ్ క్లీనరీ తో ప్రధా నంగా జరగాలని సూచించారు తదుపరి అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలో పరి శ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని స్థానికులకు ఉద్యోగ అవకా శాలు ఎక్కువగా కల్పించిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఎక్కువగా అందించే విధంగా నూత న ఓరవడికి నాంది పలికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి రానున్న ఐదు సంవ త్సరాలలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇన్చార్జి మంత్రిగా ఏడు నియోజకవర్గాల అభి వృద్ధికి ప్రణాళికా బద్దంగా తమ వంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అల్లాడ స్వామి నాయుడు పదిమంది మెచ్చుకునే విధంగా అభివృద్ధి పరంగా పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అమ్ముడ అధ్యక్షులు వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ మాట్లాడుతూ కీలకమైన బాధ్యతలతో మరింతగా శ్రమించి అమలాపురం జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలని స్వామి నాయుడును కోరారు. అమలాపురం అభివృద్ధి విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ భూ ఆక్రమణలు వంటి ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు.ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లా డుతూ అల్లాడ స్వామి నాయుడు మంచి కార్యకర్తగా స్వర్గీయ మెట్ల సత్యనారా యణరావు వద్ద కింగ్ మేకర్ గా పనిచేశారని ఏనాడు ఏ పదవిని ఆశించలేదని ప్రస్తుతం గురుతరమైన పట్టణాభివృద్ధి బాధ్యతను ఆయన సేవలకు సమర్థతకు గుర్తింపుగా ఇవ్వడం జరిగిందని ఆ పదవికి వన్నె తేవాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీలో నమ్మిన వారికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని నమ్ముకున్న వారికి తప్ప నిసరిగా అవకాశాలు దక్కుతాయని ఆయన స్పష్టం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం ప్రాంత అభివృద్ధికి మాస్ట ర్ ప్లాన్ ప్రకారం 65 కోట్లు నిధులు రోడ్ల విస్తరణ కొరకు అవసరం ఉన్నదని 7 వంతెనలు నిర్మాణం కొరకు మరో 20 కోట్లు ఖర్చు అవుతుందని తదనుగుణంగా పట్టణం లో ట్రాఫిక్ రద్దీని నియం త్రించగలమని మంత్రి కు విన్నవించారు రైతాంగ ఇక్కట్లు దృష్ట్యా ఏడు నియోజకవర్గాల పరిధిలో గోదావరి డెల్టా ఆధునీకరణ జరగాల్సిఉందని మంత్రి దృష్టికి తెచ్చారు.అమలాపురం కోనసీమ ప్రాంతం పర్యాటకం టెంపుల్ టూరిజం పరంగా అద్భుత మైన అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రభుత్వం పర్యాటకరంగా అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. ఓడలరేవు, ఎస్ యానం ప్రాంతాలు ఆహ్లాదకరంగా ఉండి జాతీయస్థాయి తేడా పోటీలకు వేదికగా నిలుస్తున్నాయన్నారు కోనసీమ ప్రాంతంలో ఉద్యోగ అవకా శాలు తక్కువని స్థానికంగా ఉన్న చమురు నిక్షేపాలు వెలికితీస్తున్న కంపెనీలలో కాంట్రాక్టు ఉద్యోగాలు స్థానికులకు ఇప్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతూ జీవనోపాదు లు మెరుగుపరచాలని సూచించారు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కోనసీమ ప్రాంతంలో డెల్టా ఆధుని కరణ చేపట్టాలని మంత్రి వర్యులకు వినయ పూర్వకంగా తెలియజేశారు మాజీ శాసనసభ్యులు వేమ మాట్లాడుతూ అంకుటిత దీక్షతో అంకిత భావంతో కోనసీమ ప్రాంత అభివృద్ధికి పట్టం కట్టాలని అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుకు సూచించారు. కొత్తపేట శాసనసభ్యులు బి సత్యానందరావు మాట్లాడు తూ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఆదర్శవం తమైన ప్రణాళికలు రచించి అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు ఎకో, దేవాలయ టూరిజం తీర ప్రాంత రిసార్ట్లు నెలకొల్పడం ద్వారా పర్యాటక కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో ప్రమాణ స్వీకారo చేయించారు ఈ కార్యక్ర మంలో అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగే శ్వర రావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మ ణ్యం మెట్ల రమణబాబు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

అమలాపురం లో ఆనందరావు అన్నా! క్యాంటీ ప్రారంభించిన అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 22: పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్ష య పాత్రగా అన్న క్యాంటీన్లు పని చేస్తున్నాయని రాష్ట్ర […]

కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు కోర్టు ఉత్తర్వులు

తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. వారం వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే, ఏసీబీ దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. మరోవైపు ఈ నెల 30 లోపు […]

సోషల్ వర్కర్ చంద్రకుమార్ కుటుంబాని పరామర్శించిన ప్రజా నాయుకులు.

నేరేడుమిల్లి చంద్రకుమార్ కు ఘన నివాళులు అర్పించిన ప్రజా నాయకులు సోషల్ వర్కర్ గా పేరు పోందిన నేరేడుమిల్లి చంద్రకుమార్ 35 సం”ఇటివలే ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూమరణించారు. శనివారం ఆయనకు దినకర్మ కార్యక్రమాన్ని […]

శుక్రవారం ఎమ్మెల్యే గిడ్డి షెడ్యూల్ వివరాలు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి.గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ షెడ్యూలు వివరాలు ప్రకారం ఉదయం 8:30 ని” శ్రీ బాల బాలాజీ టెంపుల్ అప్పనపల్లి, 9:30 ని” మామిడి కుదురు […]