

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 09:

అయినవిల్లి మండలం వైసీపీ అధ్యక్షుడుగా మేడిశెట్టి శ్రీనివాస్ నియమితులయ్యారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కే జగన్నాధ పురానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాస్ బుధవారం స్థానిక జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు ఇతర పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాలువా పూలమాలలతో ఇరువులను మేడిశెట్టి సత్కరించారు.నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడు పదవి బాధ్యతలు ఇచ్చినందుకు శ్రీనివాస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మండలంపై పార్టీలో ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని పార్టీని బలోపేతం చేస్తానని పెద్దలకు మాట ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు మరియు పార్టీ గుర్తుపై నెగ్గిన ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.