మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 12:

రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పథకాన్ని

జిల్లా పౌరసరఫ రాల అధికారి అడపా ఉదయభాస్కర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక అమలాపురం పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం లాంఛనంగా ప్రారంభిం చారు.డిప్యూటీ ఈవో ప్రధానోపాధ్యాయులు ఇతర బోధన సిబ్బంది హాజరైన ఈ కార్యక్రమం లో కూలీ పనులకు వెళ్లే వారి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకునిరాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన పోషకాహార భోజనాన్ని అందిస్తుందని అయితే ఆ భోజనంలో బియ్యం నాణ్యత సరిగా లేక ఎక్కువ మంది భోజనం చేయడం లేదని ప్రభు త్వం గుర్తించిందని దీనికి పరిష్కారంగా సన్న బియ్యం సరఫరా ద్వారా మధ్యాహ్న భోజనం అంది ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. ఆ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టళ్లు వెరసి 1534 ప్రభుత్వ పాఠశాలలు 62 సంక్షేమ హాస్టల్లో 9694 ప్యాకెట్ ఒక ప్యాకెట్ కి 25 కిలోల చొప్పున అందజేయడం జరిగిందన్నారు.ఇప్పుడు నాణ్య మైన సన్న బియ్యం తో పెడుతున్నం దువల్ల విద్యార్థులంతా ఖ చ్చితంగా స్కూల్లోనే భోజనం చేయాలన్నారు ప్రభుత్వం సమతుల్య పోషకాహారంగా అంది స్తున్న ఆహారపు యొక్క ప్రయోజనాలను విద్యా ర్థులందరూ అందుకోవాల ని ఈ సందర్భంగా డిఎస్ ఓ కోరారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూడా పిల్లలకి స్కూల్లో అందించే నాణ్యమైన ఆహారం రాగిజావ చిక్కి ఇటువంటివన్నీ ఎంతో ఉపయోగకరమని బోధిం చి పదార్థాలన్నీ స్వీక రించేలాగా చేయాలని చెప్పారు.డిప్యూటీ ఈవో మరియు ప్రధానోపాధ్యా యులు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని చేస్తామని పిల్లలకు సరైన విధంగా మార్గదర్శ కత్వం వహించి నూటికి నూరు శాతం పిల్లలు సంతృప్తిగా ఆరగించేలా చూస్తామని హామీ ఇచ్చారన్నారు.

Related Articles

క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యం: రాజ కుమారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 17: క్షయ వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

రాజోలుగంజాయి.యువకుడు అరెస్టు: ఎస్.ఐ రాజేష్ కుమార్

గంజాయి ముద్దాయికి కోర్టు 14 రోజులు రిమైండ్:ఎస్సై రాజేష్ కుమార్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు డిసెంబర్ 29: రాజోలు సబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ ను […]

దివ్యాంగులకు పెద్దదిక్కుగా వెంకయ్య నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జనవరి 22: దివ్యాంగులకు పెద్దదిక్కుగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు సాయ సహకారాలు మరువలేనిదని పరశురాముడు అన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]

అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 24: అట్రాసిటీ కేసుల్లో బాధితుల రక్షణ, దోషులకు శిక్షలు, బాధితుల పునరావాసంతో పాటుగా సత్వర న్యాయా నికి చర్యలు చేపడుతూ చట్టాలు […]