మరో రూ.123 కోట్లతో ప్రతిపాదనలు
డ్వాక్రా సంఘాలకు రూ.116 కోట్లు పంపిణీ
పార్టీలకు అతీతంగా సంక్షేమం అమలు
మీడియా సమావేశంలో మంత్రి సుభాష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం, డిసెంబర్ 28: రామచంద్రపురం నియోజవర్గంలో రూ.246 కోట్లు హెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. శనివారం ఆయన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తయిన సందర్భంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, కక్ష సాధింపు లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా రామచంద్రపురం నియోజవర్గంలో రోడ్ల మరమ్మత్తుల కోసం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ ద్వారా రూ.15 కోట్లు హెచ్చించి పనులు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా రూ. 9.72 కో ట్లతో పనులు, డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు రూ. 116 కోట్లు అందించామన్నారు. ఇటీవల వరదల వల్ల జరిగిన పశునష్టం, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం, పశువుల షెడ్ల నిర్మాణం వంటి పనులకు నిధులు కేటాయించా మన్నారు. గడచిన ఆరు నెలల్లో రూ. 246 కోట్లతో రామచంద్రపురం నియోజవర్గం అభివృద్ధి చేసామని వెల్లడించారు. నియోజవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కింద రూ.73. 84 కోట్లు పంపిణీ చేసామన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా రూ.6.89 కోట్లతో, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 46 మంది నిరుపేదలకు రూ.86 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించామని ప్రకటించారు. గత వైసిపి పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేసారని విమర్శించారు. పలుమార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపా రన్నారు. తగదునమ్మా అంటూ ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం, కూటమి ప్రభుత్వo పై బురద చల్లే ప్రయత్నంలో భాగమన్నారు. సిఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే 1.5 లక్షల ఉపాధ్యాయ పోస్టులు నియామకం చేపట్టారన్నారు. ప్రస్తుతం మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16,450 ఉపాధ్యాయ పోస్టులు నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు. జగన్ హయాంలో ఒక ఉద్యోగమైన ఇచ్చారా అని ప్రశ్నించారు.
వెంకటాయపాలెం కమ్యూనిటీ హాల్ పై అనవసర రాద్ధాంతం.
గత వైఎస్ఆర్సిపి అవినీతిపై చర్చించేందుకు డిబేట్ కు సిద్ధం.
రామచంద్రపురం నియోజవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్ఆర్సిపి నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. భవన నిర్మాణం పూర్త కాకుండా అనధికారికంగా అద్దెకు ఇవ్వడo పై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని ఆధారాలతో మండల జెఈ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నిజా నిజాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం సారికాదు అన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విచారణ అధికారిని నియమించారని, చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. వెంకటాయపాలెం సర్పంచ్, రాజ్యసభ సభ్యులు పిల్లి.సుభాష్ చంద్రబోస్, అతని కుమారుడులు వాస్తవాన్ని వక్రీకరిస్తూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గత వైసిపి పాలనలో జరిగిన అవినీతిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. పైగా తమ పార్టీలో కి రానందుకే తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వైసిపి నాయకులను పార్టీలోకి ఆహ్వానించే అవసరం తమకు లేదన్నారు. నవరత్నాల పేరుతో నియోజకవర్గంలో అవినీతి జరిగిందని అన్నారు. జగనన్న కాలనీ లేఅవుట్ల ల్యాండ్ ఫిల్లింగ్, ఈ క్రాప్ ఇన్సూరెన్స్ లో, ద్రాక్షారామ దేవాలయంలో, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో జరిగిన అవినీతిపై డిబేట్ కు రావాలని మంత్రి సవాల్ విసిరారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వo కక్ష సాధింపు చర్యలకు దూరమని, అదే సమయంలో అవినీతిని సహించబోమని మంత్రి సుభాష్ హెచ్చరించారు.