
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం మార్చ్ 27:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాలు, సహజ న్యా యానికి కట్టుబడి నిర్వహించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి తాసిల్దార్లు ఉప తాసిల్దార్లు సర్వేయర్లు వీఆర్వోలకు పిలుపు నిచ్చారు. గురువారం స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన తాసిల్దార్లు ఉప తాసిల్దా ర్లు మండల గ్రామ సర్వే యర్లు వీఆర్వోలతో రీసర్వే పై శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పైలెట్ కార్యక్రమం దాదాపుగా పూర్తిగా వస్తుందని రెండవ దశలో ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి సర్వే నిర్వహించాలని జా యింట్ కలెక్టర్ సూచించారు.

ఈ శిక్షణలో పైలెట్ గ్రామా లలో క్షేత్రస్థాయిలో ఉత్ప న్నమైన సమస్యలు దిద్దుబాటు, వెబ్ లాండ్, మొబైల్ అప్లికేషన్ డేటా ఎంట్రీ,, రీ సర్వే సమయ పాలన దిశగా రెండో విడత సర్వే నిర్వహణ, ఉప తాసిల్దార్లు లేవనెత్తిన సమస్యలు, కే స్టడీ, సబ్ డివిజన్, ఆక్వా చెరువులతో జాయింట్ ఎల్పిఎం రూపకల్పన ఇత్యాది అంశాలపై శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. రీ సర్వే ఉద్దేశ్యాన్ని నొక్కి భూ యాజమాన్యాలకు తెరపాల న్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని రీసర్వే కార్యకలాపాలను సజా వుగా నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

సమస్యలను పరిష్కరించ డానికి రీసర్వే అధికారులకు విస్తృత అధికారాలు మంజూరు చేయబ డ్డాయన్నారు. రెవెన్యూ రికార్డులలోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని భవిష్యత్ తరా లకు బాగా నిర్మాణాత్మక వ్యవస్థను ఏర్పాటు చేయా ల్సిన అవసరాన్ని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి రీసర్వే ప్రాజెక్టుపై తీవ్రంగా దృష్టి సారించారని, ఇది నిజ మైన పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉండాలని, నిజమైన లబ్ధిదారులకు తగిన గుర్తింపు లభించేలా చూడాలని ఆమె పే ర్కొన్నారు. జవాబుదా రీతనం ప్రస్తుత చట్టాలకు కట్టుబడి ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలపాలన్నారు.

భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూడా లని అధికారులను కోరారు. క్షేత్ర స్థాయిలో ఎదురైన సవాళ్లను పరిష్కరిస్తామని, అవసరమైతే చట్టపరమైన సవరణ లను పరిశీలిస్తామని ఆమెస్పష్టం చేశారు.ఆధునిక రీసర్వే ప్రయత్నాలలో అధునాతన సాంకేతికత పాత్రను హైలైట్ చేస్తూ, చట్టపర మైన నిబంధనలపై స్పష్టమైన అవగాహన పొం దాలని అధికారులను కోరారు. ఆర్డీవోలు ప్రసంగిస్తూ రీసర్వే విధానం ప్రయోజనాల పై వివరణాత్మక వివరణలు భూ యాజమాన్యాలకు ఇవ్వాలని, రీసర్వే సమ యంలో ప్రజల భౌతిక ఉనికి యొక్క ప్రాముఖ్యతను స్పష్టం గా చెప్పాలని మీ-భూమి వెబ్సైట్లోని రికార్డులను యాక్సెస్ చేసే ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సూచించారు భూ రికార్డుల శుద్ధి ఈ పునః సర్వే ప్రధాన లక్ష్యమన్నారు దీని కోసం సర్వే బృందాలు, జిల్లా కలెక్టర్లు ఇతర జిల్లా స్థాయి అధికారులకు విస్తృతమైన మార్గదర్శకాలు ఉన్నాయ న్నారు భూమి సర్వేను 30 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సి ఉండగా వివిధ కారణాలతో జరగ లేదని అన్నారు.

భూసరి హద్దులను స్పష్టంగా స్థాపిం చడానికి తరువాత భూముల యాజమాన్యాన్ని స్పష్టంగా నిర్ధారించడానికి రీసర్వే ఒక వేదికను ఏర్పాటు చేసింద న్నారు దీనివల్ల భూ వివా దాలు చాలా వరకు తగ్గు తాయని,ఆధునికతను వినియోగించి గ్రామాల్లో డ్రోన్లను ఉపయోగించి రీసర్వే జరుగుతోందని, వీటిని నిరంతరం పనిచేసే రిఫరెన్స్ స్టేషన్లు, ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజెస్ తో జోడించి ఓ ఆర్ ఐ అంది న తర్వాత గ్రౌండ్ సర్వే ప్రారం భమవుతుందన్నారు. ప్రతి బృందం తేదీలు సర్వే నంబర్లతో సహా రీసర్వే గురించి సమాచారాన్ని గ్రామస్తులకు తెలియ జేయడానికి బాధిత ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరిం చడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింద న్నారు .ప్రైవేట్, వ్యవ సాయ భూములకు కొలతలు వేయా లని తర్వాత మిగిలిన గ్రామా ల్లోనూ రీ సర్వే చేప డతార న్నారు. ఈ మొత్తం ప్రక్రియను నిర్దేశిత సమయం లో పూర్తి చేయాలన్నారు. రైతుల సమ క్షంలో వారి ఆమోదంతోనే రీ సర్వే చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు గతంలో సర్వేలో భూముల విస్తీర్ణం తగ్గిందని, హద్దులు మార్చే శారని, హక్కుపత్రాల్లో త ప్పులు దొర్లాయని రైతులు పెద్దసంఖ్యలో వినతులు అందించారన్నారు.

అన్నదాతల ఆవేదనను పరిగణన లోనికి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం వారికి అవగా హన కల్పించి ఆ తర్వాతే రీ సర్వే చేపట్టా లని జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామాల్లోని వ్యవ సాయ భూముల విస్తీర్ణాన్ని బట్టి సర్వే బృందాల్ని ఏర్పాటు చేయాలన్నారు సర్వే సమయంలో సంబంధిత భూముల యజమానులు అందుబాటులో ఉండేలా ముందస్తు సమాచారం పంపుతారని. వారికి అనుకూల తేదీల్లోనే కొలతలు చేపట్టాలన్నారు. భూయ జమానుల సమక్షంలోనే రీసర్వే చేయాలని స్పష్టం చేశారు. హద్దుల విషయంలో సరైన స్పష్టత ఇవ్వాలని సూచించారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3 సార్లు అవకాశం కల్పించాలని తెలిపారు. గతంలో ఉత్ప న్నమైన తప్పులు సరి చేసేందుకే భూములను రీసర్వే చేయనున్నట్లు ప్ర భుత్వం ప్రకటించిందన్నారు.. అంతేకాకుండా తప్పులు సరి చేసేందుకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహణ ద్వారా మరొక సారీ లోపాలన్నింటిని గుర్తించి సరిచేసేందుకు పకడ్బందీగా భూముల రీసర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణ యించిందన్నారు.పాస్ బుక్ రూపం కూడా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింద న్నారు. ఈ పాస్ పుస్తకంపై రాజముద్ర క్యూర్ కోడితో వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి ఎల్ ఎన్ రాజకుమారి ఆర్డీవోలు పి శ్రీకర్ డి అఖిల కే మాధవి తదితరులు పాల్గొన్నారు.