

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జూలై 08:

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సి ఎస్ ఆర్ నిధుల నుండి కోటి రూపాయలు నిధులు మంజూరు అయినట్లు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం కెనరా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సత్యనారాయణ రాజు తో ఎమ్మెల్యే సుబ్బరాజు తో కలిసి సమావేశం అయ్యామన్నారు.

ఈ సమావేశంలో ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి వివరించామని కళాశాల అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగిందని ఆయన స్పందించి తక్షణమే కోటి రూపాయల సి ఎస్ ఆర్ నిధులను మంజూరు చేశారని తెలిపారు. దీనిపై ఈ రోజు కెనరా బ్యాంకు రీజినల్ అధికారి గణేష్,ఎమ్మెల్యే బుచ్చిబాబుతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించారు.పూర్తి స్థాయిలో కళాశాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.