
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 08:



రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన అన్ని అంశాలతో సుమారు 4గంటల పాటు విజయవంతంగా నిర్వ హించాలని ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాల యాజమాన్యాలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ప్రవేట్ పాఠశాలలు జూనియర్ కళాశాల యాజమాన్యాల తో మెగా పేరెంట్ మీట్ గురించి అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క ప్రణాళిక సన్నాహాలతో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడంలో భాగస్వామ్యం వహించాలని ఆయన స్పష్టం చేశారు తల్లి దండ్రులు-ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను మెరు గుపరచడం, విద్యార్థుల అభ్యసన పురోగతిని చర్చించడం, పాఠశాల కార్య క్రమాలను తెలియజేయడం విద్యార్థుల సామర్థ్యాలపై అంచనా వేసి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు తల్లిదండ్రులు ఉపాధ్యా యులకు సౌకర్యవంతమైన విద్యార్థులు ఉపాధ్యాయు లు వారి తల్లిదండ్రులకు అనువైన వేదికను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు షెడ్యూల్ ప్రకారం ప్రారంభ సమయం, ప్రసంగాలు, చర్చా సమయాలు, విరామాలు, ముగింపు అంశాలపై సమయపాలన పాటించాలన్నారు.

కార్యక్రమ నిర్వహణకు వివిధ పనులను పంచుకోవడానికి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని తెలియజేయా లన్నారు.పాఠశాల యాజ మాన్యం, ప్రధానోపాధ్యా యులు విద్యా నిపుణుల ద్వారా విద్య ప్రాముఖ్యత, పాఠశాల విధానాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రసంగాలు నిర్వహించాలన్నారు.ప్రతి విద్యార్థి యొక్క పురోగతి, బలాలు, బలహీనతలు మరియు మెరుగుదల అంశాలపై తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత చర్చలకు సమయం కేటాయించాల న్నారు తల్లిదండ్రులు తమ సమస్యలను లేదా సందే హాలను నివృత్తి చేసుకోవ డానికి ఒక వేదికను మెగా పేరేంటి టీచర్ మీటింగ్ అందిస్తుందన్నారు. ఈ వేదిక విద్యార్థుల అభ్యస నానికి మరియు పాఠశాల అభి వృద్ధికి గణనీయంగా దోహదపడుతుందన్నారు.

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు అన్ని ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించా లన్నారు అమ్మపేరుతో మొక్కలు నాటడం, ఆటలపోటీలు, సహపంక్తి భోజనాలు ఇలా పండుగ వాతావరణంలో సమావే శాలను నిర్వహించాలన్నా రు .10వ తేదీ ఉదయం 9 గంటలకు మెగా పేరెంట్ టీచర్ మీటింగులు ప్రారంభమవుతాయని. తల్లిదండ్రులు, ఇతర ప్రముఖలను పాఠశాలలకు ఆహ్వానిస్తారన్నారు. అక్కడ ఏర్పాటు చేసే ఓపెన్‌హౌస్ ఫొటోబూత్ వద్ద విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఫొటో దిగుతారు. ప్రతివిద్యార్థి తల్లిదండ్రులతో సంబంధిత క్లాస్ టీచర్ ప్రత్యేకంగా సమావేశమై పిల్లల సమగ్ర పురోగతి కార్డులు(పోగ్రస్), హెల్త్‌కార్డులు అందిస్తార న్నారు అదేసమయంలో తల్లికి వందనం పథకం, గుడ్‌టచ్, బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంట్ మీటింగ్, మనబడి మేగజైన్ తదితర అంశాల గురించి అవగా హన కల్పించాలన్నారు 11గంటలకు విద్యార్థులతో వారి తల్లులకు పుష్పాలు సమర్పించి పాదాలకు నమస్కరించే కార్యక్రమం నిర్వహించి అనంతరం తల్లిపేరుతో మొక్కను విద్యార్థి నాటాలన్నారు డ్రగ్స్, సైబర్ అవేర్‌నెస్ కార్యక మాలు నిర్వహిం చాలన్నారులన్నారు పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములం అవుతామంటూ సామూహిక ప్రతిజ్ఞ చేయించాలన్నారు. చివరగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యాకమిటీ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, ఆహ్వానితులు కలసి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి సహపంక్తి భోజనాలు నిర్వహించాల న్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ సలీం భాష, సమగ్ర శిక్ష ఏపీసి జి మమ్మీ, ఉప విద్యాశాఖ అధికారి బి వి ఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి వి సోమశేఖర రావు తదితరులు పాల్గొన్నారు