

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రావులపాలెం జూలై 06:

విధి నిర్వహణలో ప్రమాదవ శాత్తు మృతి చెందిన ఆలమూరు ఎస్సై ఎం,అశోక్, కానిస్టేబుల్ ఎస్.బ్లెస్సన్ కుటుంబాలకు సహచర ఉద్యోగులు రూ. 31 లక్షల ఆర్థికసాయం అందించారు. 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సైలుగా నియమితులైన సుమారు 1100 మంది ఈవిరాళాన్ని సమకూర్చుకున్నారు. అందులో భాగంగా ఎస్సై అశోక్ నివాసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్లి ఆదివారం కుటుంబ సభ్యులకు రూ/- 26 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం ఎస్సై అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే ఆలమూరులోని కానిస్టేబుల్ బ్లెస్సన్ నివాసానికి వచ్చి అతని కుటుంబసభ్యులకు రూ/- ఐదు లక్షల చెక్కును అందజేశారు. అనంతరం కానిస్టేబుల్ బ్లెస్సన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కర్తవ్య నిర్వహణలో మృతి చెందిన తమ సహచర ఉద్యోగులైన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ లు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తమ వంతు సాయంగా ఈవిరాళాన్ని అందించినట్లు వివరించారు.