సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎం.పి. హరిష్ ఎమ్మెల్యే వేగుళ్ళ

తలుపు తట్టి…ప్రభుత్వ విజయాలను గడప గడపకు…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట జూలై 06:

కూటమి ప్రభుత్వ విజయాలను తలుపు తట్టి గడపగడపకు వివరించడమే సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం అని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ అన్నారు. ఆదివారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలంలోని సోమేశ్వరం, మాచవరం, మండపేట మండలంలోని ఏడిద గ్రామాలలో ఆయన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కలసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలలో భాగంగా మొదటగా రాష్ట్రంలో పింఛన్ల పండగ నెలకొందన్నారు.

ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా నగదు తల్లి ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుందన్నారు.

ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ప్రజలలో కూటమిపై అపారమైన నమ్మకం కలిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలను తలుపు తట్టి ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సుపరి పాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

Related Articles

ఏపీలో 55/- కే లీటర్ పెట్రోల్ ఎవరికో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.55కే లీటరు పెట్రోల్.. రూ.50కే డీజిల్ అందించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్రయోజనం కేవలం దివ్యాంగులకు మాత్రమే. ఆయా జిల్లాలో దివ్యాంగులు రాయితీపై పెట్రోల్, డీజిల్ పొందొచ్చు. […]

పర్యాటకం,గార్మెంట్స్ తయారీ, పాడి పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలు: ఎమ్మెల్యే ఆనందరావు

వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (విడిపి) విజయవంతం: కలెక్టర్ మహేష్ కుమార్ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 15: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో […]

ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు

👉ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టుల భర్తీ. 👉ఖాళీల వివరాలు: మెడికల్ కాలేజీలో స్టోర్ కీపర్, కంప్యూటర్ ప్రోగామర్, ఎలక్ట్రిక్ హెల్పర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ […]

త్వరలోనే మరో మెగా డీఎస్సీ: భట్టి

నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే మరో 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ‘ఒకరోజు హాస్టల్ తనిఖీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. […]