
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు జూలై 05:

మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్య రావు ఆశీస్సులతో వైసిపి రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధిగా నియమితులైనట్లు తాడి సహదేవ్ వెల్లడించారు.
పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, రాజోలు నియోజకవర్గానికి చెందిన తాడి సహదేవ్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సహదేవ్ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యరావుకు కృతజ్ఞతలు తెలిపారు.