V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం ఏప్రిల్ 28:

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో వచ్చే అర్జీదారుల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి పరిష్కరిస్తూ వారి నమ్మకాన్ని నిలబె ట్టాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, డిఆర్ఓ రాజకుమారి, డ్వామా, డిఆర్డిఏ పి డీలు, ఎస్ మధుసూదన్ జయచంద్ర గాంధీ, ఎస్ డి సి కృష్ణమూర్తిలు సుమారు గా 233 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ అర్జీలకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పరిష్కారాలను చూపాలని ఏ ఒక్క అర్జీని సరైన కారణాలు చూపకుండా పరిష్కరించినట్లు ఎండా ర్స్మెంట్ చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అర్జీ దారుల సమక్షంలో విచారిస్తూ ఆమోదయోగ్యంగా సంతృప్తే కొలమానంగా పరిష్కరించాలన్నారు. ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన అర్జీలను నాణ్యతతో పరిష్కరిం చాలని ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యo వహిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పిజిఆర్ఎస్ కార్య క్రమంలో ద్వారా ప్రభుత్వ లక్ష్యాలనునెరవేచ్చేందుకు అధికారులు కృషి సల్పాలన్నారు. ఒకే అంశంపై అర్జీలు పునరావృతం కాకుండా గడువు దాటిన అర్జీలు లేకుండా అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ meekosam.ap. gov.in వెబ్సైట్లో అర్జీదారులు తమ సమస్యలను నమోదు చేసుకుని వచ్చునని నమోదైన అర్జీల పరిష్కార స్థితి గతులను తెలుసు కోవాలనుకున్నప్పుడు 1100 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తెలుసుకొని వచ్చునన్నారు. అర్జీలను మొక్కుబడిగా కాకుండా పూర్తి నాణ్యత ప్రమాణాలతో అర్జీదారుల సం తృప్తే ధ్యేయంగా ప్రతి అధికారి పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.