
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట
మండపేట జూలై 05:
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వైసిపి కార్యదర్శి గాచెందిన టేకిముడి శ్రీనివాస్ని నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం వైసిపి కార్యాలయం లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చైర్ పర్సన్ ఛాంబర్ లో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన్ను నియమించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిర్లజగ్గి రెడ్డి, మండపేట నియోజకవర్గం వైయస్సార్ పార్టీ ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు లకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు,8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్, 18వ ఇంచార్జ్ యర్ర గుంట మణికంఠ కుమార్, సాధన శివ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.