


V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జూలై 10:

నేటి సమాజానికి అనుగుణంగా V9 ప్రజా ఆయుధం మీడియా సమాజంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని మాజీ ఎంపీ అనురాధ పేర్కొన్నారు.

ప్రజా ఆయుధం దినపత్రిక జర్నలిస్ట్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ ను గురువారం మర్యాద పూర్వకంగా మీడియా తరపున కలిసారు.

ఈ సందర్భంగా మీడియా ప్రాముఖ్యత పై కొన్ని నిమిషాలు చర్చించారు. ఈ విషయాలపై ఆమె మాట్లాడుతూ…ప్రజలకు వార్తలు,సంఘటనలు, మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అందించడంలో ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముందు నడుస్తుందని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు.
నిరంతరం ప్రజలకు వార్తా సమాచారం అందించడంలో మీకు మీరే చాటి అని V9 ప్రజా ఆయుధం మీడియా సంస్థ చైర్మన్ వినయ్ కుమార్ ను మాజీ ఎంపీ అనురాధ అభినందించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ ప్రజా ఆయుధం దినపత్రిక కవరేజీ చేసే విషయాలను పూర్తిగా వివరించారు.
సంస్థ త్వరగా తెలుగు రాష్ట్రాలు విస్తరించే దిశగా ప్రయాణానికి ప్రయత్నాలు చెయ్యాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కుంచే శ్రీకాంత్, నవీన్, ప్రబాస్ తదితరులు పాల్గొన్నారు.