V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -కే గంగవరం ఏప్రిల్ 22:

ఉభయ తారకమైన ప్ర యోజనాలతో పల్లెలకు ఊపిరి పోసిన పథకంగా విరాజిల్లుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం జి నరేగా) దేశానికి పట్టుగోమ్మలైన గ్రామాల అభివృద్ధికి వలసల నివారణకు ఎంతగానో తోడ్పాటు నందిస్తోందని రాష్ట్ర కార్మిక సంక్షేమం ఫ్యాక్టరీలు బాయిలర్లు కార్మిక ఆరోగ్య భీమా సేవలు శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. మంగళవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండల పరిధిలోని బాలాంత్రం గ్రామం లో ఆజాదికా అమృత్ మహోత్సవం, అమృత్ సరోవర్ పథకం అమల్లో భాగంగా స్థానిక చెరువుల అభివృద్ధి పునరుద్ధరణ కొరకు సుమారుగా రూ.9 లక్షల 90వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమా లను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం వర్షా భావం కరువు కాటకాల సందర్భంలో ప్రజలు గ్రామాలను విడిచి వలసలు వెళ్లకుండా నరేగా పథకం జీవనో పాదులు కల్పి స్తూ దోహదపడు పడు తుందన్నారు ఒకవైపు వలసలు నివారిస్తూనే మరొకవైపు పరోక్షంగా మెటీరియల్ కాంపోనెంట్ ఉపాధి పనుల మూలం గా జనరేట్ కాబడి గ్రా మాలలో మౌలిక వసతు లుమెరుగుపడు తున్నా యన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో తలమానిక మైన నరేగా పథకం గ్రామాల అభివృద్ధికి ఇతోధికంగా సహాయప డుతుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల కు ఒక ఆర్థిక సంవత్సరం లో కనీసం 100 రోజుల వేతనంతో కూడిన పనిని చట్టబద్ధంగా హామీ ఇస్తూ, గ్రామీణ ప్రజల జీవనోపా ధి భద్రతను మెరుగుపర చడానికి, పేదరికాన్ని తగ్గించడానికి పట్టణాలకు వలసలను నివారించడా నికి ఈ పథకం ఉద్దేశింపబడిందన్నారు.

ఈ పథకం ద్వారా నీటి సంరక్షణ, కరువు నివారణ, వరద నియంత్రణ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులు నిర్వహించడం జరుగు తుందన్నారు.ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉపా ధి అవకాశాలను పెంచడంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నా మన్నారు గ్రామీణ ప్రాం తాల్లో ఉపాధి అవకాశాల ను పెంచడంలో పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పిం చడంలో నరేగా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు.మిషన్ అమృత్ సరొవర్ ముఖ్య ఉద్దేశం ప్రతి జిల్లాలో అమృత్ సరోవర్లను చెరువులు నిర్మించడం లేదా పునరుద్ధరించడం. తద్వారా చెరువులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారని
వీటి పునరుద్ధరణ ద్వారా నీటి సంరక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టడం.భూగర్భ జలాల స్థాయిని పెంచడం జరుగుతుందన్నారు.

స్థిరమైన అభి వృద్ధిని సామాజిక భాగస్వా మ్యాన్ని ప్రోత్సహిస్తూ సాంప్ర దాయ నీటి వనరులను పునరుద్ధరించడం జరుగు తుందన్నారు. నీటి కొరత నుతగ్గించడంలో భూగర్భ జలాల లభ్యతను పెంచ డంలో ఈ పథకం గణనీ యమైన కృషి చేసింద న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీపీ పంపన నాగమణి పంచాయతీ కార్యదర్శి భాస్కర లక్ష్మి ఏపీవో గణపతి. ప్రజా ప్రతిని ధులు తదితరులు పాల్గొన్నారు.